హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship : ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారా..? రూ.1కోటి స్కాలర్‌షిప్ పొందే అవకాశం..!

Scholarship : ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారా..? రూ.1కోటి స్కాలర్‌షిప్ పొందే అవకాశం..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Scholarship : అభ్యర్థులు అక్టోబర్ 9లోపు రిజిస్టర్ చేసుకోవాలి. అంతర్జాతీయ విద్యార్థులకు ఈ యూనివర్సిటీ మూడు స్కాలర్‌షిప్స్‌ను కేటాయించింది. ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్‌షిప్ విలువ $200,000 ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

విదేశాల్లో ఉన్నత విద్య చదవడం చాలా మంది విద్యార్థుల (Students) కల. అయితే ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ట్యూషన్ ఫీజుల, రోజువారీ ఖర్చులు తదితర వాటిని కలుపుకుంటే మొత్తం బడ్జెట్ (Budget) తడిసి మోపెడు అవుతుంది. దీంతో చాలామంది విదేశాల్లోని టాప్ వర్సిటీల్లో చదువుకోలేక వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆస్ట్రేలియాకు చెందిన ‘కాన్‌బెర్రా’ యూనివర్సిటీ (University of Canberra). విదేశీ విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్ (Scholarship) అందించనున్నట్లు ప్రకటించింది.

అంతర్జాతీయ విద్యార్థుల కోసం కాన్‌బెర్రా యూనివర్సిటీ ప్రత్యేకంగా వైస్-ఛాన్సలర్ సోషల్ ఛాంపియన్ స్కాలర్‌షిప్స్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 9లోపు రిజిస్టర్ చేసుకోవాలి. అంతర్జాతీయ విద్యార్థులకు ఈ యూనివర్సిటీ మూడు స్కాలర్‌షిప్స్‌ను కేటాయించింది.

ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్‌షిప్ విలువ $200,000 ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం దాదాపు కోటి రూపాయాలకు సమానం. కోర్సుకు సంబంధించిన ట్యూషన్ ఫీజు, క్యాంపస్‌లో అకామిడేషన్, ఇయర్లీ అలవెన్స్ 10,000 ఆస్ట్రేలియన్ డాలర్లు స్కాలర్ షిప్‌లో కలిసి ఉంటాయని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

* ఆఫర్ లెటర్ తప్పనిసరి..

ఈ వైస్-ఛాన్సలర్ సోషల్ ఛాంపియన్ స్కాలర్‌షిప్ అన్ని ప్రధాన ఖర్చులను కవర్ చేస్తుంది. 2023 మొదటి సెమిస్టర్ కోసం కాన్‌బెర్రా యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్‌ ఉంటేనే ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ కాన్‌బెర్రా నుంచి ఆఫర్ లెటర్ లేకుండా సమర్పించిన స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రాసెస్ చేయబోమని వర్సిటీ స్పష్టం చేసింది. అలాగే సప్లిమెంటరీ ఫారమ్‌కు సంబంధించిన లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని యూనివర్సిటీ తెలిపింది.

* వీరికి కూడా స్కాలర్‌షిప్స్..

ఈ స్కాలర్‌షిప్‌ను విద్యా రంగానికి మాత్రమే కాకుండా, నాయకత్వ లక్షణాలు, సామాజిక సమానత్వం పట్ల అభిరుచిని ప్రదర్శించే విద్యార్థులకు సైతం మంజూరు చేయనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీని కొనసాగించాలనుకునే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించడం, తద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం తమ లక్ష్యమని కాన్‌బెర్రా యూనివర్సిటీ పేర్కొంది.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. వివిధ రంగాల్లో 4.80 లక్షల ఖాళీలు.. వెంటనే అప్లై చేసుకోండి

* స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన అంశాలు..

ఆర్థిక అవసరంతో పాటు వివిధ రంగాల్లో విలువలు, ఎక్స్‌పీరియన్స్‌ను స్టేట్‌మెంట్ రూపంలో విద్యార్థులు డెమాన్‌స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా సామాజిక, ఆర్థిక సమానత్వ సూత్రాలను స్వీకరించి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్లో లీడర్‌గా ఎదిగే అవకాశం, సమాజానికి అనుకూలమైన మార్పులను విభిన్నంగా, నూతనంగా ఇతరులకు స్ఫూర్తినిచ్చే విధంగా చేయడం.. అనేక సాంస్కృతిక కార్యక్రమాల నుంచి నేర్చుకోవడం, సహకరించడం వంటి అంశాల్లో విద్యార్థులు డెమాన్‌స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. వీసీ సోషల్ ఛాంపియన్‌షిప్ స్కాలర్‌షిప్ గురించి మరింత సమాచారం కోసం, విద్యార్థులు @canberra.edu.au వెబ్‌సైట్ సందర్శించాలని కాన్‌బెర్రా యూనివర్సిటీ సూచించింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Australia, Career and Courses, EDUCATION, JOBS, Scholarship

ఉత్తమ కథలు