ఎంఎస్ (MS) వంటి ఉన్నత చదువులను విదేశాల్లో అభ్యసించడం చాలా మంది విద్యార్థుల కల. అయితే అందుకు తగ్గ ఆర్థిక స్థోమత లేక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం అమెరికా (America)లోని అరిజోనా యూనివర్సిటీ ఓ సదావకాశం కల్పించింది. గ్రేట్ లెర్నింగ్ (Great Learning) సహకారంతో ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మెషిన్ లెర్నింగ్‌పై MS ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. 21-నెలల పాటు జరిగే ప్రోగ్రామ్‌ను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అరిజోనా యూనివర్సిటీలోని లీడింగ్ ఎక్స్పర్ట్స్ తోపాటు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ కూడా పాఠాలు బోధించనున్నారు. గ్రేట్ లెర్నింగ్ ఎడ్‌టెక్‌కు సంబంధించిన క్యూరేటెడ్ జాబ్స్ పోర్టల్ (Job Portal) ద్వారా అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
వ్యాపార సమస్యలకు ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ (Information Solution) రూపొందించడానికి, భవిష్యత్తు కోసం సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం కోసం నిపుణులకు అవసరమైన పరిజ్ఞానాన్ని సమకూర్చడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని యూనివర్సిటీ తెలిపింది. తద్వారా రియల్ వరల్డ్ ఇన్ ఫార్మేషన్ మేనేజ్మెంట్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి లెర్నర్స్లో అవసరమైన స్పెషల్ స్కిల్స్ పెంపొందుతాయని పేర్కొంది. ప్రోగ్రామ్‌లో భాగంగా 11 హ్యాండ్-ఆన్ ప్రాజెక్ట్స్, మెంటర్షిప్ సెషన్స్ ఉంటాయి.
JEE Preparation: జేఈఈలో బెస్ట్ స్కోర్‌తో ఉత్తీర్ణత సాధించాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా సైంటిస్ట్ లేదా ఇంజనీర్, డిజిటల్ ఆర్టిస్ట్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్/ఇంజనీర్, వెబ్ ప్రోగ్రామర్ వంటి డిమాండ్ ఉన్న రోల్స్‌పై అవసరమైన అర్హతలతో అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ (Graduation0 చేయవచ్చు అని వర్సిటీ తెలిపింది. గ్రేట్ లెర్నింగ్ ఎడ్టెక్ సంస్థ 7,800 కంటే ఎక్కువ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఇందులో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ (Amazon), డెల్, ఐబిఎమ్, ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫోసిస్, ఇంటెల్, డెలాయిట్ వంటి కీలక కంపెనీలు ఉన్నాయి. దీంతో అభ్యర్థులు ప్లేస్‌మెంట్‌ను ఈజీగా సాధించడానికి అవకాశం ఉంటుంది.
అరిజోనా యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్, డాక్టర్ కేథరీన్ ఎఫ్ బ్రూక్స్ మాట్లాడూతూ.. అత్యంత అనుభవం ఉన్న యూనివర్సిటీ గ్లోబల్ టీమ్‌తో మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్‌ను గ్లోబలైజ్ చేయడానికి అరిజోనా యూనివర్సిటీకి చెందిన iSchool ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. ఇందుకోసం తాము గ్రేట్ లెర్నింగ్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌లలో గ్రేట్ లెర్నింగ్ ఒకటన్నారు.
Agnipath Scheme: యువత కోసం కేంద్రం అగ్నిపథ్ స్కీమ్.. ఏమిటి ప్రత్యేకతలు.. వివరాలు
ఈ రకమైన గ్లోబల్ రీచ్ కమ్యూనిటీలు సమాజాంలో నిజమైన మార్పును తీసుకురాగలవని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. విద్యార్థులు వారి కెరీర్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు, వారు ఉంటున్న ప్రాంతంలోనే పనిలో ప్రభావవంతంగా ఉండటానికి ఈ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తోందని కేథరీన్ ఎఫ్ బ్రూక్స్ అభిప్రాయపడ్డారు.
గ్రేట్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ నాయర్ మాట్లాడుతూ... ప్రస్తుతం బిజినెస్ మొత్తం డేటాతో నడుస్తోందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో డేటాను వినియోగించుకోవాలని చూస్తున్న ప్రతి ప్రొఫెషనల్, బిజినెస్ లీడర్‌కు ఈ ప్రోగ్రామ్ అవసరమైన స్కిల్స్ (Skills) అందిస్తుందనడంలో సందేహం లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.