హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

UGC Online Courses | మీరు ఆన్‌లైన్‌లో డిగ్రీ లేదా పీజీ చేయాలనుకుంటున్నారా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆన్‌లైన్ కోర్సుల్ని ప్రకటించింది.

కరోనా వైరస్ మహమ్మారితో ఆన్‌లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగిపోయింది. డబ్బులు చెల్లించి నేర్చుకునే కోర్సులతో పాటు ఉచిత కోర్సులు కూడా అనేకం ఉన్నాయి. విద్యార్థులకు ఉచితంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఓ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసింది. స్వయం పేరుతో ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టీవ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్-SWAYAM అని అర్థం. ఈ ప్లాట్‌ఫామ్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC మ్యాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్-MOOCs ప్రకటించింది. ఈ ఏడాది జూలై సెషన్ కోసం 83 అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కోర్సుల్ని, 40 పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ కోర్సుల్ని ప్రకటించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు తెరుచుకునే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఆన్‌లైన్ కోర్సులకే డిమాండ్ ఎక్కువ. ఇప్పుడు డిగ్రీ, పీజీ చేయాలనుకునేవారికి ఇది ఓ మంచి అవకాశం. అయితే ఇవన్నీ నాన్ ఇంజనీరింగ్ కోర్సులే. ఈ కోర్సులు ఉచితంగా పూర్తి చేయొచ్చు. వీడియో లెక్చర్స్, పీడీఎఫ్‌లో స్టడీ మెటీరియల్, సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్స్ అండ్ క్విజెస్, ఆన్‌లైన్ డిస్కషన్ ఫోరమ్ లాంటివి ఉంటాయి. ఇంటర్నల్ అసెస్‌మెంట్, సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మరిన్ని వివరాలకు https://swayam.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో యూజీసీ అందిస్తున్న యూజీ కోర్సులు ఇవే


B.A Political Science

BA LLB

B.A. Hindustani Music (Tabla)

B.A History

BSc Biochemistry

BA English

B.Sc./B.B.A./B.A./B.Co m.

BSc Environmental Science

BA Geography

BBA/Bcom Management Studies

B.Sc. Chemistry

B.Sc. Home science

B.Sc./B.B.A./B.A./B.Com. Computer Science

BBA/B.Com CONSUMER BEHAVIOUR

B.Sc., B.E., Electronics

UG/PG Digital Forensics

BA Education

BSc Botany

B.Sc../B.A./ B.Com. Environmental Studies

B.B.A./B.Com.

BSc Food Technology

B.Com

B.A Performing Arts (Dance)

BSc Biotechnology

B.A Urdu

B.Sc. Biomedical Scinces

B.Sc. Home Science

BA Performing Arts

B.A Sociology

B.A English

B. Pharmacy

BA Tourism

B.A sociology

B.SC. Computer Science

B.com. Economics

BBA/B.Com Marketing Management

B.Sc.Multimedia Visual Communication, Mass Communication, Journalism,

B.A Honours (Education)

BSc Microbiology

B.Sc., Physics

BBA Management

B.Sc. Applied Geology

NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

LIC HFL Recruitment 2021: ఎల్ఐసీ హౌసింగ్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో యూజీసీ అందిస్తున్న పీజీ కోర్సులు ఇవే


M.Sc Computer Science

M.Sc Biochemistry

M.Sc Statistics and Biological Sciences & Bioengineer ing, Life Science

M.Ed Education

M.Com/MBA Commerce

MCA/M.Sc Computer Science and Engineering

M.Lib Library and Information Science

MBA/Multi discipline

M.Com/MBA

M.Ed

M.A Sociology

M.A. English

M.A Hindi

M.A Sanskrit

M.Sc Computer Science

M.A Public Administration

M.Sc Statistics

M.A Law

M.Sc/M.Te ch Geology

M.Sc Mathematics

M.Sc Chemistry

M.Sc Mathematics

M.A Social Science

M.A Tourism

స్వయంగా ప్లాట్‌ఫామ్‌లో విద్యార్థులు స్వయంగా కోర్సులు నేర్చుకోవచ్చు. విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైనా ఇందులో కోర్సులు చేయొచ్చు. ఈ కోర్సులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తైన తర్వాత సర్టిఫికెట్స్ లభిస్తాయి.

First published:

Tags: CAREER, Distance Education, EDUCATION, Exams, Online classes, Online Education, UGC

ఉత్తమ కథలు