హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC: ఏపీలో ఈ యూనివర్సిటీ ఫేక్... యూజీసీ ప్రకటన... విద్యార్థులూ జాగ్రత్త

UGC: ఏపీలో ఈ యూనివర్సిటీ ఫేక్... యూజీసీ ప్రకటన... విద్యార్థులూ జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UGC: యూజీసీ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర/ ప్రావిన్షియల్ చట్టం ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీలు లేదా డీమ్డ్-టు-బి యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలను ప్రదానం చేయడానికి అర్హత ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇండియా (India)లోని నకిలీ యూనివర్సిటీ(Universities)లకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). దేశవ్యాప్తంగా ప్రస్తుతం 21 నకిలీ యూనివర్సిటీ(Fake Universities)లు ఉన్నాయని ప్రకటించింది. విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం వీటికి లేదని యూజీసీ స్పష్టం చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం- 1956కు వ్యతిరేకంగా ఈ 21 ఫేక్ వర్సిటీలు పనిచేస్తున్నాయని తెలిపింది. వీటిలో 8 ఢిల్లీకి చెందినవి కాగా, నాలుగు ఉత్తరప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని.. ఇక, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కటి ఉన్నాయని యూజీసీ వెల్లడించింది.


యూజీసీ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర/ ప్రావిన్షియల్ చట్టం ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీలు లేదా డీమ్డ్-టు-బి యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలను ప్రదానం చేయడానికి అర్హత ఉంది. అలాగే, ప్రత్యేకించి పార్లమెంట్ చట్టం ద్వారా అధికారం పొందిన సంస్థలు కూడా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తాయని యూజీసీ తెలిపింది.


మరోవైపు విద్యార్థులు, పబ్లిక్ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని నకిలీ యూనివర్సిటీల జాబితాను యూజీసీ విడుదల చేసింది. వీటిని సెల్ఫ్- స్టైల్డ్, గుర్తింపు లేని సంస్థలుగా పేర్కొంది. డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ఈ సంస్థలకు అసలు ఉండదని స్పష్టం చేసింది.



* ఢిల్లీకి చెందిన నకిలీ యూనివర్సిటీలు
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPPHS), కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్(ADR)-సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, అధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిట్చువల్ యూనివర్సిటీ) నకిలీవిగా యూజీసీ డిక్లేర్ చేసింది.


* యూపీలోని నకిలీ యూనివర్సిటీలు

గాంధీ హిందీ విద్యాపీఠం, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్.. ఈ నాలుగు వర్సిటీలు యూపీలోని నకిలీ విద్యా సంస్థలని యూజీసీ స్పష్టం చేసింది.


ఇది కూడా చదవండి : ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందా.. అయితే అక్కడ ఈ అవకాశం ఉంది..


ఒడిషాలోని నవభారత్ శిక్షా పరిషత్ యూనివర్సిటీ, నార్త్ ఒరిస్సా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలు.. వెస్ట్ బెంగాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలు నకిలీవని యూజీసీ వెల్లడించింది.


బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ కర్ణాటక , సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనట్టం కేరళ , రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగ్‌పూర్ మహారాష్ట్ర , శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్- పుదుచ్చేరి , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ‌లు నకిలీవని యూజీసీ గుర్తించింది.

First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, UGC

ఉత్తమ కథలు