ప్రస్తుతం రెగ్యులర్ విధానంలోనే కాకుండా డిస్టెన్స్, ఓపెన్ పద్ధతిలో చాలా మంది డిగ్రీలు పొందుతున్నారు. వివిధ కారణాలతో కళాశాలకు వచ్చి చదువుకోలేని, మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ తరహా కోర్సులను తీసుకొచ్చారు. చాలా వర్సిటీలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు.. ఓపెన్, డిస్టెన్స్ విధానంలో కోర్సులను అందించాలంటే ఇకపై యూనివర్సిటీలు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు యూజీసీ అనుమతులు జారీ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల్లో పేర్కొన్న విధంగా అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఆమోదంతో యూనివర్సిటీలు కోర్సులను అందించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
కీలక భేటీలో సవరణలకు ఆమోదం
పలు నివేదికలు తెలిపిన వివరాల మేరకు.. యూజీసీ 2022 అక్టోబర్ 28న కీలక సమావేశం నిర్వహించింది. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ రెగ్యులేషన్స్‌కు చేసిన సవరణలను యూజీసీ ఈ భేటీలో ఆమోదించింది. కొత్త నిబంధనలు 2022 నవంబర్ 18న భారత గెజిట్‌లో ప్రచురించింది. యూజీసీ (Categorization of Universities (only) for Grant of Graded Autonomy) రెగ్యులేషన్స్- 2018లోని రెగ్యులేషన్ 4, క్లాజ్ 4.10 ప్రకారం.. యూనివర్సిటీలు ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్‌లో కోర్సులను యూజీసీ అనుమతి లేకుండా ఆఫర్ చేయవచ్చు.
అయితే UGC (ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్) రెగ్యులేషన్స్, 2017 కింద నిర్దేశించిన అన్ని షరతులను యూనివర్సిటీలు సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే ఇలా చేయడానికి యూనివర్సిటీలకు అధికారం ఉండేది. అయితే కాలానుగుణంగా ఈ నిబంధనలకు సవరణలు చేశారు. ఇకపై యూనివర్సిటీలు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్‌లో కోర్సులను అందించాలంటే తప్పనిసరిగా యూజీసీ ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై అధికారిక ఉత్తర్వులో ఇలా పేర్కొంది.. యూనివర్సిటీలు ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్‌లో కోర్సులను అందించవచ్చు. యూజీసీ ఆమోదంతో, నిబంధనల ప్రకారం నిర్దేశించిన అన్ని షరతులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. ఓపెన్, డిస్టెన్స్ మోడ్‌కు సంబంధించిన కోర్సులను ఏ పేరుతో పిలిచినా యూజీపీ ఎప్పటికప్పుడు వాటిని నోటిఫై చేస్తుందని తెలిపింది.
విదేశీ వర్సిటీల నుంచి సానుకూల స్పందన
భారతీయ ఉన్నత విద్యా సంస్థలతో కలిసి జాయింట్ అండ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించే ప్రతిపాదనలకు విదేశీ యూనివర్సిటీల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవల వెల్లడించింది. భారతదేశానికి చెందిన 230 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, విదేశాలకు చెందిన 1,256 ఉన్నత విద్యాసంస్థలు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి ప్రధానంగా లండన్ యూనివర్సిటీ, మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్యారిస్ యూనివర్సిటీ, హైడెల్బర్గ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, మెల్బోర్న్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్ యూనివర్సిటీ, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, క్వీన్ మేరీ వంటి యూనివర్సిటీలు ఈ జాబితాలో ఉన్నట్లు యూజీసీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: UGC, University Grants Commission