కమ్యూనికేషన్ రంగంలో ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ కోసం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ (యుఎన్‌సీసీడి) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 3 నుంచి 6 నెలల వ్యవధి గల ఈ ఇంటర్న్‌షిప్‌కు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. డిగ్రీ ఫైనలియర్లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఆసక్తి గల అభ్యర్థులు యూఎన్‌సిసిడి అధికారిక వెబ్సైట్ www.unccd.int/about-us/secretariat/vacancies/apply-unccd-internship ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జూలై 15లోపు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేయాలి. ఎంపికైన ఇంటర్న్స్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అసోసియేట్ పర్యవేక్షణలో పని చేయాల్సి ఉంటుంది.
ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ప్రోడక్ట్స్ అండ్ యాక్టివిటీస్‌పై దృష్టి సారించాలి. యూఎన్‌సిసిడి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డ్‌ఇన్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లకు మెరుగైన కంటెంట్‌ను రూపొందించడం, వాటిని షెడ్యూల్ చేయడంపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను యూజర్లకు మరింత చేరువ చేసేందుకు ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్స్ కన్వర్జేషన్‌ను రూపొందించాలి. తద్వారా, UNCCD ఆన్‌లైన్ వేదికలను ప్రజలకు మరింత దగ్గర చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. జూలై 15 దరఖాస్తుకు చివరి తేది.
NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
IBPS RRB 2021: బ్యాంకుల్లో 12,958 జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ వివరాలు తెలుసుకోండి
కాగా, ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఇంగ్లీష్‌లో ప్రావీణ్యత ఉండాలి. అనగా ఇంగ్లీష్‌లో స్పష్టంగా మాట్లాడటం, రాయడం, అర్ధం చేసుకోవడం వచ్చి ఉండాలి. వీటితో పాటు ఇతర అధికారిక యూఎన్ భాషలైన అరబిక్, చైనీస్, స్పానిష్ లేదా రష్యన్లో ప్రావీణ్యత ఉంటే ఎంపిక ప్రక్రియలో కలిసొస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను జర్మనీలోని బాన్ యుఎన్‌సిసిడి కార్యాలయంలో నిర్వహిస్తారు. అయితే, అభ్యర్థులు తమ ఇంట్లో నుంచే రిమోట్‌గా పని చేయవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ను ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్ రెండు విధానాల్లో అందిస్తున్నారు.
IBPS RRB 2021: బ్యాంక్ జాబ్ మీ కలా? 12,958 పోస్టులకు అప్లై చేయండి ఇలా
IGCAR Recruitment 2021: ఆటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో 337 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
అయితే, ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారు కనిష్టంగా మూడు నెలలు, గరిష్టంగా ఆరు నెలలు ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. అర్హత విషయానికి వస్తే.. దరఖాస్తుదారుడు జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనలియర్ చదువున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, JOBS, NOTIFICATION, United Nations