UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రేపే నోటిఫికేషన్... దరఖాస్తు చేయండిలా

UPSC NDA NA Exam II 2020 notification | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కలా? ఇండియన్ ఆర్మీ, నేవీ లాంటి సంస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? జూన్ 10న ఎన్‌డీఏ ఎన్ఏ 2 నోటిఫికేషన్ విడుదల కానుంది.

news18-telugu
Updated: June 9, 2020, 11:39 AM IST
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రేపే నోటిఫికేషన్... దరఖాస్తు చేయండిలా
UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రేపే నోటిఫికేషన్... దరఖాస్తు చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC కసరత్తు చేస్తోంది. జూన్ 10న నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2 నోటిఫికేషన్ నోటిఫికేన్ విడుదల చేయనుంది. ప్రతీ ఏడాది ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహిస్తుంది యూపీఎస్‌సీ. 418 పోస్టులతో ఎన్‌డీఏ ఎన్ఏ 1 నోటిఫికేషన్ గతంలోనే విడుదలైంది. కానీ 2020 ఏప్రిల్ 19న జరగాల్సిన పరీక్ష కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఎన్‌డీఏ ఎన్ఏ 1, 2 నోటిఫికేషన్లకు ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది యూపీఎస్‌సీ. సెప్టెంబర్ 6న ఎగ్జామ్ జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో ఖాళీలను భర్తీ జరుగుతుంది. ఇంటర్ లేదా 10+2 పాసైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఎన్‌డీఏ ఎన్ఏ 2 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి జూన్ 30 చివరి తేదీ.

UPSC NDA & NA Exam (II) 2020: అప్లై చేయండి ఇలా



ముందుగా https://www.upsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో National Defence Academy and Naval Academy Examination (II), 2020 లింక్ పైన క్లిక్ చేయండి.
దరఖాస్తు చేసేముందు నియమనిబంధనలు పూర్తిగా చదవండి.
ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ పైన క్లిక్ చేయండి.NDA 2020 అప్లికేషన్ పేజీ కనిపిస్తుంది.
మొదట Part-I రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
మీ వివరాలతో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేయాలి.
ఫీజు చెల్లించి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌తో ఇంటర్మీడియట్ లేదా 10+2 పాసైనవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయడానికి మరో ఛాన్స్

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1004 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

ECIL Jobs: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 82 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: June 9, 2020, 11:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading