Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే

Indian Railways | యూపీఎస్‌సీ నిర్వహించబోయే ఐఆర్ఎంఎస్ కోసం అభ్యర్థులు మొదట ప్రిలిమ్స్ రాసి, ఆ తర్వాత ఐఆర్ఎంఎస్‌లో ఐదు స్పెషాలిటీస్‌లో ఒకటి ఎంచుకోవాలి.

news18-telugu
Updated: December 27, 2019, 2:57 PM IST
Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే
Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే ఉద్యోగం మీ కలా? రైల్వేలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? రైల్వే ఎగ్జామ్స్ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నారా? భారతీయ రైల్వేలో నియామక ప్రక్రియ మారబోతోంది. భారతీయ రైల్వే వ్యవస్థాగత మార్పులు, పునర్నిర్మాణం కోసం కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అందులో రైల్వేలో నియామకాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. భారతీయ రైల్వేలో ప్రస్తుతం ఉన్న 8 గ్రూప్ ఏ సర్వీసుల్ని కలిపి ఒకే సెంట్రల్ సర్వీస్ ఏర్పాటు చేయబోతున్నారు. అదే ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్-IRMS. ఐఏఎస్, ఐపీఎస్‌లాగా ఐఆర్ఎంఎస్ నియామకాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐఆర్ఎంఎస్ నియామకాలు కూడా యూపీఎస్సీ పరిధిలోకే వస్తాయి.

యూపీఎస్‌సీ నిర్వహించబోయే ఐఆర్ఎంఎస్ కోసం అభ్యర్థులు మొదట ప్రిలిమ్స్ రాసి, ఆ తర్వాత ఐఆర్ఎంఎస్‌లో ఐదు స్పెషాలిటీస్‌లో ఒకటి ఎంచుకోవాలి. అందులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, టెక్నికల్ స్పెషాలిటీస్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. నాన్ టెక్నికల్ పేరుతో మరో స్పెషాలిటీ ఉంటుంది. ఈ పోస్టు ద్వారా అకౌంట్స్, పర్సనల్, ట్రాఫిక్ విభాగాల అధికారులను నియమిస్తారు. ఇకపై రైల్వేలో కొత్త నియామకాలన్నీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారానే జరుగుతాయని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. అయితే ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలపై చర్చించాల్సి ఉందన్నారు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 251 క్లర్క్ పోస్టులకు మరో నోటిఫికేషన్... పూర్తి వివరాలివేIOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 312 జాబ్స్... ఖాళీల వివరాలివే

Telangana Jobs: సంగారెడ్డిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ... ఇంటర్ అర్హత
Published by: Santhosh Kumar S
First published: December 27, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading