UPSC Jobs: సివిల్స్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కొత్త షెడ్యూల్

UPSC Jobs | కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే నియామక పరీక్షలన్నీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ తెలుసుకోండి.

news18-telugu
Updated: June 5, 2020, 4:36 PM IST
UPSC Jobs: సివిల్స్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కొత్త షెడ్యూల్
UPSC Jobs: సివిల్స్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కొత్త షెడ్యూల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC అన్ని నియామక పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఎన్‌డీఏ, ఎన్ఏ, సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎగ్జామ్స్, రిక్రూట్‌మెంట్ టెస్టులకు కొత్త తేదీలను శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షలన్నీ కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఈ పరీక్షలన్నీ పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసింది యూపీఎస్‌సీ. అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో షెడ్యూల్ అప్‌డేట్ చేసింది. యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020 అక్టోబర్ 4న, మెయిన్ ఎగ్జామ్ 2021 జనవరి 8న జరగనుంది. ఇక మిగతా పరీక్షలు ఎప్పుడెప్పుడు జరగనున్నాయో తెలుసుకోండి.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 1- 2020 సెప్టెంబర్ 6

సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 4
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 4
ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 16 నుంచి 3 రోజులు
కంబైన్డ్ జియో సైంటిస్ట్ మెయిన్ ఎగ్జామ్- 2020 ఆగస్ట్ 8 నుంచి 2 రోజులు
ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్- 2020 ఆగస్ట్ 9కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ 22
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 20
నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2- 2020 సెప్టెంబర్ 6
సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్- 2021 జనవరి 8 నుంచి 5 రోజులు
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్-CDS ఎగ్జామ్ 2- 2020 నవంబర్ 8
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్- 2021 ఫిబ్రవరి 28 నుంచి 10 రోజులు
ఎస్ఓ/స్టెనో ఎల్‌డీసీఈ- 2020 డిసెంబర్ 12 నుంచి 2 రోజులు
రిజర్వ్‌డ్ ఫర్ యూపీఎస్‌సీ ఆర్‌టీ ఎగ్జామినేషన్- 2020 డిసెంబర్ 20

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 3,795 ఉద్యోగాలు... వివరాలివే

Jio Internship: విద్యార్థులకు గుడ్ న్యూస్... రిలయెన్స్ జియో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ చేయండిలా
Published by: Santhosh Kumar S
First published: June 5, 2020, 4:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading