news18-telugu
Updated: January 25, 2020, 10:40 AM IST
UPSC Jobs: నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 418 ఖాళీలు... జనవరి 28 లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఖాళీల భర్తీకి 'యూపీఎస్సీ ఎన్డీఏ ఎన్ఏ-1 2020' నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీలో చేరాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. మొత్తం 418 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశల రాతపరీక్ష, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్
https://www.upsc.gov.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 28 చివరి తేదీ.
UPSC NDA-1 2020: నోటిఫికేషన్ వివరాలివే...
మొత్తం ఖాళీలు- 418
నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 (ఆర్మీ- 208, నేవీ- 42, ఎయిర్ ఫోర్స్-120)
నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) - 48
నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 8
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 8దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 28 సాయంత్రం 6 గంటలు
పరీక్ష తేదీ- 2020 ఏప్రిల్ 19
విద్యార్హత- ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్తో ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ కావాలి.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే
Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
Bank Jobs: బ్యాంకు ఉద్యోగం కావాలా? ఈ నోటిఫికేషన్లకు అప్లై చేయండి
Published by:
Santhosh Kumar S
First published:
January 25, 2020, 10:40 AM IST