యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Union Public Service Commission) సివిల్ సర్వీసెస్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. UPSC CSE ప్రీ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా చేసుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు అంటే 01 ఫిబ్రవరి 2023న విడుదల చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 21 ఫిబ్రవరి 2023 చివరి తేదీగా పేర్కొన్నారు. చివరి తేదీకి ముందు సూచించిన ఫార్మాట్‌లో దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే.. సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పిస్తారని తెలిపారు.
UPSC CSE పరీక్షకు దరఖాస్తు చేయడానికి.. మీరు ఈ వెబ్‌సైట్‌ను upsconline.nic.in సందర్శించవచ్చు లేదా upsc.gov.in దీని ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. UPSC సివిల్ ఎగ్జామ్ 2023 కోసం దరఖాస్తులు ఫిబ్రవరి 21 వరకు ఉంటాయి. అప్లికేషన్ కరెక్షన్ విండో మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 22న ఓపెన్ అవుతుంది. ఈ విండో సహాయంతో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు సవరణలు చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ ఎగ్జామ్ 28 మే 2023న నిర్వహించబడుతుంది . ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1105 ఖాళీలను నియామకం కోసం భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు విడుదలైన సివిల్ నోటిఫికేషన్ లో అతి భారీ మొత్తంలో పోస్టులను కేటాయించిన నోటిఫికేష్ ఇదే.
దరఖాస్తు రుసుము విషయానికొస్తే.. ఈ పరీక్షకు జనరల్ కేటగిరీ అభ్యర్థి రూ. 100 ఫీజు చెల్లించాలి. SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందిన అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 21 నుంచి 32 ఏళ్లు. రిజర్వ్‌డ్ మరియు ఇతర వర్గాలకు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను చూడటానికి అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయండి. ఈ లింక్ ద్వారా కూడా మీరు ఆ నోటీస్ లో పేర్కొన్న వివరాలను తెలుసుకోవచ్చు.
దరఖాస్తుదారు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నమోదు చేసుకోవాల్సి ఉంటుది. ఆపై దరఖాస్తులను ఓటీఆర్ ద్వారా చేసుకోవాలి. ఈ సంవత్సరం కమిషన్ 1105 ఖాళీలను భర్తీ చేస్తోంది. దివ్యాంగులకు ఈ సారి భారీ మొత్తంలో ఖాళీలను కేటాయించారు. ఇందులో బెంచ్‌మార్క్ వైకల్యం కేటగిరీకి చెందిన వ్యక్తుల కోసం 37 ఖాళీలు , సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ క్యూర్డ్, డ్వార్ఫిజం, యాసిడ్ దాడి బాధితులు మరియు కండరాల బలహీనతతో సహా లోకోమోటర్ వైకల్యం కోసం 15 పోస్టులను కేటాయించారు. ఉన్నాయి. బహుళ వైకల్యాల కోసం 10 ఖాళీలు. అభ్యర్థులు 28 మే 2023 (ఆదివారం) న జరగనున్న CSE ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అండ్ దరఖాస్తుల సమర్పణ ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.