UPSC Results : సివిల్ సర్వీసెస్ మార్కుల వెల్లడి..

UPSC Results | సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. మొత్తం 759 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 6:33 PM IST
UPSC Results : సివిల్ సర్వీసెస్ మార్కుల వెల్లడి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 14, 2019, 6:33 PM IST
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2018 మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ఎ, గ్రూప్ బి పోస్టులకు మొత్తం 759 ఎంపికయ్యారు. వీరి మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మార్కుల వివరాలను యూపీఎస్సీ వెల్లడించింది.
వివిధ విభాగాల్లో మొత్తం 812 పోస్టులకు గాను 759 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ 361, ఓబీసీ 209, ఎస్సీ 128, ఎస్టీ 61 మంది అభ్యర్థులు ఉన్నారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో సివిల్స్ పరీక్షలు నిర్వహించాగా. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేసి ఏప్రిల్ 5న రిజల్ట్స్ ప్రకటించారు. ఆ మార్కుల వివరాలనే ఇప్పుడు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రిజల్ట్స్‌లో ఐఐటీ ముంబైకి చెందిన స్టూడెంట్ కనిషక్ కటారియా టాపర్‌గా నిలిచాడు. తర్వాతి స్థానంలో అక్షత్ జైన్ రెండో ర్యాంకు, జునైద్ అహ్మద్‌కి మూడో ర్యాంకుల్లో నిలిచారు. టాప్ 25లో 15మంది పురుష అభ్యర్థులుండగా.. 10 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా చూస్తే 759 మంది అభ్యర్థుల్లో 577, 182 మంది మహిళలున్నారు.

First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...