UNION MINISTER JITENDRA SINGH ON SATURDAY SAID COMMON ELIGIBILITY TEST FOR GOVT JOBS RECRUITMENT TO BE HELD IN SEPTEMBER NS
CET for Bank, Railways, SSC: అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక ఒకే పరీక్ష.. ఎప్పుడు నిర్వహిస్తారంటే..
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(CET)ను సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(CET)ను సెప్టెంబర్ లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందు కోసం కేంద్ర మంత్రి వర్గ ఆమోదంతో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(NRA)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) మరియు రైల్వే రిక్రూట్మెంటట్ బోర్డ్(RRB) తదితర ఉద్యోగ నియామకాలకు కామన్ ఎంట్రస్ట్ టెస్ట్ నిర్వహించనున్నారు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తామన్నారు. నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఓ స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని చెప్పారు. సెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు వివిధ ఇతర ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చని స్పష్టం చేశారు.
సెట్ గురించి కీలక విషయాలు..
-గ్రాడ్యుయేట్, ఇంటర్(10+2), టెన్త్ అభ్యర్థులకు వేర్వేరుగా సెట్ నిర్వహిస్తారు.
-సెట్ స్కోర్ కు మూడేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. వయోపరిమితి ఆధారంగా అభ్యర్థులు ఎన్ని సార్లు అయినా ఈ పరీక్షను రాయొచ్చు.
-సెట్ పరీక్షకు హాజరయ్యేందుకు జిల్లాకు ఓ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. రూరల్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు, దివ్యాంగులు, మహిళలకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
-వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించడానికే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.