UNION MINISTER FOR SOCIAL JUSTICE AND EMPOWERMENT LAUNCHES SRESHTA SCHEME WITH AN AIM TO PROVIDE QUALITY EDUCATION TO THEM IN REPUTED PRIVATE SCHOOLS GH SRD
SRESHTA: ఎస్సీ పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన కేంద్రం..
ప్రతీకాత్మక చిత్రం
SRESHTA: ఎస్సీ సామాజిక వర్గంలో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు శుభవార్త చెప్పింది కేంద్రం. వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అసలేంటీ ఆ పథకం..? దాని వల్ల కలిగే లాభాలేంటి..?
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్ స్కీమ్‌ను ప్రారంభించింది. దీనికి ‘ది స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్’(SRESHTA) అనే పేరు పెట్టారు. ఈ పథకాన్ని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.ఎస్సీ సామాజిక వర్గంలో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడం కోసం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ SRESHTA పథకాన్ని రూపొందించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ పథకం ద్వారా ఉచితంగా చదువుకోవచ్చు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.
శ్రేష్ట(SRESHTA) పథకం కోసం నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ (NETS) ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు మూడు వేల ప్రతిభ ఉన్న పేద ఎస్సీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులు సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్న టాప్ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్‌లలో 9 నుంచి 12వ తరగతుల్లో అడ్మిషన్లు పొందుతారు.ఆపై ఉన్నత చదువులను కొనసాగించడానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ లేదా టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్‌కు ఆ విద్యార్థులను కనెక్ట్ చేయనున్నారు.
ఈ పథక అమలుకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, సీబీఎస్‌ఈ, డిపార్ట్‌మెంట్‌లోని ఫైనాన్స్ విభాగం ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు రూపొందించిన నియమ నిబంధనల ఆధారంగా ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఎంపిక చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్(PMS)లను మంజూరు చేయనుంది. ఈ మేరకు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్ ఇ- పాస్ పోర్టల్ telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యూవల్‌తో పాటు తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఇ-పాస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ డేటాను అక్టోబర్ 24లోపు అప్‌లోడ్ చేయాలి.
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు(BC), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (EBC), మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వికలాంగ విద్యార్థులు కూడా అర్హులే. అర్హత ప్రమాణాలు స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి.
విద్యార్థులు కచ్చితంగా మెట్రిక్ లేదా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. SC లేదా ST వర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC, లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. అదే విధంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75%గా ఉండాలి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.