హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Ramakrishna Mission: విద్యార్ధుల కోసం రామకృష్ణ మిషన్ కీలక నిర్ణయం.. ఆ ప్రోగ్రామ్ తో అన్ని విభాగాల్లోనూ శిక్షణ..

Ramakrishna Mission: విద్యార్ధుల కోసం రామకృష్ణ మిషన్ కీలక నిర్ణయం.. ఆ ప్రోగ్రామ్ తో అన్ని విభాగాల్లోనూ శిక్షణ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ramakrishna Mission: విద్యార్థుల కోసం రామకృష్ణ మిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అవేకింగ్ అనే ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటి..? దీని ద్వారా విద్యార్థులు ఎటువంటి లబ్ధి పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ప్రాథమిక విద్య (1-5వ తరగతులు) అభ్యసించే విద్యార్థుల (Students) కోసం రామకృష్ణ మిషన్ (Ramakrishna Mission) కీలక నిర్ణయం తీసుకుంది. వీరి కోసం ‘అవేకింగ్’ (Awakening) అనే ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా విద్యార్థులను అన్ని విభాగాల్లోనూ శిక్షణ ఇస్తారు. భవిష్యత్తుల్లో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం కనుగొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Education Minister) ప్రారంభించారు.

* సామాజిక స్పృహ కోసం

ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. విద్య ప్రధాన లక్ష్యాలలో సామాజిక పరివర్తన తీసుకురావడం ఒకటి. భౌతిక సంపద కంటే విలువలు, నాలెడ్జ్ చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం సామాజిక స్పృహతో కూడిన తరాన్ని నిర్మించడానికి వాల్యూ -బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా అవసరమని చెప్పారు.

* 9 నుంచి 12వ తరగతులకు కూడా..

రామకృష్ణ మిషన్‌కు అప్లైడ్ ఎడ్యుకేషన్ అందించే వారసత్వం ఉందని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020 అమలు చేస్తున్న తరుణంలో 1 నుంచి 8 తరగతులకు ప్రోగ్రామ్‌లను రూపొందించడంతో పాటు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు విలువ ఆధారిత విద్యా కార్యక్రమాలను రూపొందించడంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020 విధానం తరహాలో పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని నిర్ధారించే దిశగా రామకృష్ణ మిషన్ చేస్తున్న ఈ ప్రయత్నం చాలా గొప్పదని ఆయన కొనియాడారు.

మన విద్యావ్యవస్థ తప్పనిసరిగా జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు. ప్రపంచ బాధ్యతలను చేపట్టే సామర్థ్యం ఉన్న 21వ శతాబ్దపు పౌరులను మనం సృష్టించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల నేతృత్వంలోని సంపూర్ణ విద్యా వ్యవస్థపై దృష్టి సారించే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 అనేది ఆ దిశగా వేస్తున్న అడుగని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు.

* అడ్వైజరీ ఫ్రేమ్‌వర్క్‌

ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో వాల్యూ-బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడానికి ఒక అడ్వైజరీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ బోర్డుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు.

ఇది కూడా చదవండి :  ఇండియన్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఖర్చులన్నీ కవర్ అయ్యేలా స్కాలర్‌షిప్.. వివరాలివే..

కాగా, రామకృష్ణ మిషన్, ఢిల్లీ శాఖ, 2014 నుంచి మిడిల్ స్కూల్ విద్యార్థుల్లో ఆత్మగౌరవం పెంపొందించడానికి అవేక్‌డ్ సిటిజన్ ప్రోగ్రామ్(ACP)ని విజయవంతంగా నిర్వహిస్తోంది. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ఈ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఎంతగానో సహాయపడుతోంది. ఈ ప్రోగ్రామ్ లో ఆరువేల ఇన్‌స్టిట్యూషన్‌లకు చెందిన 55,000 మంది ఉపాధ్యాయులు,12 లక్షల మంది విద్యార్థులు చేరి లబ్ధి పొందుతున్నారు.

ప్రైమరీ స్కూల్ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని విద్యావేత్తల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా ‘అవేకనింగ్’ అనే ప్రోగ్రామ్‌ను ఇప్పటికే 126 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, Schools

ఉత్తమ కథలు