Home /News /jobs /

UNION HUMAN RESOURCES DEVELOPMENT MINISTRY HAS BEEN TAKEN DECISION ON CBSE EXAMS AND WILL REPLY TO SUPREME COURT SS

సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్, నీట్ పరీక్ష తేదీలపై ఉత్కంఠ

Exams: సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్, నీట్ పరీక్ష తేదీలపై ఉత్కంఠ... 
(ప్రతీకాత్మక చిత్రం)

Exams: సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్, నీట్ పరీక్ష తేదీలపై ఉత్కంఠ... (ప్రతీకాత్మక చిత్రం)

CBSE | సీబీఎస్ఈ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ యూజీ 2020 పరీక్షల నిర్వహణపై ఇవాళ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని, మంగళవారం సుప్రీం కోర్టుకు తన నిర్ణయాన్ని వెల్లడించనుందని తెలుస్తోంది.

    పెండింగ్‌లో ఉన్న పలు పరీక్షల్ని ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇవాళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పరీక్షల్ని నిర్వహించాలా లేదా వాయిదా వేయాలా అన్న అంశంపై జూన్ 23 లోపు సమాచారం ఇస్తామని ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE సుప్రీం కోర్టుకు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. గడువు ముంచుకొస్తుండటంతో పెండింగ్‌లో ఉన్న పరీక్షలపై సోమవారం నిర్ణయం తీసుకుంది. మంగళవారం సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వనుంది. సీబీఎస్ఈ పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్ 2020, నీట్ యూజీ 2020 పరీక్షల్ని నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ సంక్షోభంగా కారణంగా ఈ పరీక్షలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

    జూలై 1 నుంచి జూలై 15 వరకు సీబీఎస్ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పటికీ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది సీబీఎస్ఈ. కానీ ఈ పరీక్షల్ని నిర్వహించాలా వద్దా అన్న ఆలోచనలో ఉంది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇప్పటికే హెచ్ఆర్‌డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వారం రోజులుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA, సీబీఎస్ఈ, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని సురక్షితంగా చూడాలన్న అంశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పలు రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిషా లాంటి రాష్ట్రాలు సీబీఎస్ఈ పరీక్షల్ని రద్దు చేయాలని కోరాయి.

    12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై జూన్ 23న విచారణ జరగనుంది. ఇక నీట్ యూజీ 2020, జేఈఈ మెయిన్ 2020 పరీక్షల్ని తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరీక్షల ద్వారానే దేశంలోని వేర్వేరు కాలేజీలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుంది. లక్షలాది మంచి విద్యార్థుల భవిష్యత్తు ఈ పరీక్షలపై ఆధారపడి ఉంది. మరి ఈ పరీక్షలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏ నిర్ణయం తీసుకుందో, మంగళవారం సుప్రీం కోర్టుకు ఏం వివరించనుందో తెలియాల్సి ఉంది.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి

    Govt Jobs: ఇంటర్ పాసయ్యారా? ఈ 669 ఉద్యోగాలకు అప్లై చేయండి

    Telangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
    First published:

    Tags: CAREER, CBSE, EDUCATION, Exams, JEE Main 2020, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు