కొత్త విద్యా విధానం (New Education Policy) - 2020 హిందీ మీడియంలో ఎంబీబీఎస్ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదివారం మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ప్రారంభించారు. MBBS మొదటి సంవత్సరం విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ మరియు బయోకెమిస్ట్రీపై కొత్తగా మూడు పాఠ్యపుస్తకాలను ఆయన విడుదల చేశారు. వారి మాతృభాషలో వీటిని అధ్యయనం చేయొచ్చన్నారు. హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడంపై ప్రసంగించిన సందర్భంగా విద్యారంగంలో విప్లవాత్మకమైన పునరుజ్జీవన ఘట్టమని అమిత్ షా అన్నారు. హిందీ మీడియం(Hindi Medium) మరియు ఇతర ప్రాంతీయ భాషలలో మెడికల్ అండ్ ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులలో విద్యను అందించడం మోడీ లక్ష్యం అని ఆయన వివరించారు. మన భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందుకు మోదీ విజన్‌కు ధన్యవాదాలన్నారు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాలు తమ మాతృభాషలో ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్‌లను సిద్ధం చేసే పనిని ప్రారంభించాయని అన్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని అమలు చేస్తున్నందుకు కేంద్ర విద్య , నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సమయంలో, ప్రధాన్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మరియు ఉన్నత విద్యా మంత్రి ధన్ సింగ్ రావత్‌తో కలిసి రాష్ట్రంలో 2022-23 సెషన్‌కు ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం (NEP) 2020ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని మరింత మెరుగైన రీతిలో అమలు చేయడం ద్వారా ఈ దేవభూమి నుంచి అనేక సిద్ధాంతాలు వెలువడతాయన్నారు.
రాబోయే కాలంలో విద్యార్థులందరూ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకునేలా ఇప్పుడు కృషి చేయాలని అన్నారు. మెరుగైన విద్యతోనే ఏ దేశమైనా, సమాజమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
జాతీయ విద్యా విధానం 2020 అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందన్నారు. చదువుతోపాటు పిల్లల్లో నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, భాషా వికాసం, నైతిక విలువలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ విద్యా విధానం కింద ప్రాథమికంగా మూడేళ్లపాటు పిల్లలను అధికారిక విద్యకు అనుసంధానం చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ (విధానం) కింద బాల వాటిక ప్రారంభించబడింది. బాల వాటికా పథకం కింద మూడేళ్లు నేర్చుకుని ఒకటవ తరగతిలో అడ్మిషన్ తీసుకుంటారు.
దేశం డిజిటల్ ఇండియా దిశగా వేగంగా దూసుకుపోతోందన్నారు. ఉత్తరాఖండ్‌లో రూపొందిస్తున్న విధానం ఈ దిశలో ఒక పెద్ద ముందడుగని కొనియాడారు. ఇది ప్రపంచ అవసరాలకు రాష్ట్ర యువతను సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020 అమలు కోసం ఉన్నత విద్యా శాఖ సమర్థవంతంగా , దశలవారీగా అనేక చర్యలు తీసుకుందని అన్నారు. 21వ శతాబ్దపు కొత్త, ఆధునిక, స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి మోదీ నాయకత్వం లో రూపొందించబడిన నూతన విద్యా విధానం ఎంతో గొప్పదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Career and Courses, JOBS, Uttarakhand