CBSE Class 12 Exams: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అవుతాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి.. వివరాలివే

రమేష్ పోఖ్రియాల్(ఫైల్ ఫొటో)

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు అవుతాయంటూ వస్తున్న వార్తలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

  • Share this:
    దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పలు బోర్డు ఎగ్జామ్స్ ను రద్దు చేశాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలోనూ టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన కేసీఆర్ సర్కార్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది. అయితే ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేసింది. అయితే జూలై లో ఇంటర్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తామని కేంద్రానికి ఇటీవల రాసిన లేఖలో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాగైనా టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే కరోనా కేసుల నేపథ్యంలో టెన్త్ ఎగ్జామ్స్ ను ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. జూలైలోనే అక్కడ ఇంటర్, టెన్త్ పరీక్షలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
    TS EAMCET 2021: తెలంగాణలో ఎంసెట్ పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారంటే..
    Andhra Pradesh Exams: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్ సెట్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే..

    ఇదిలా ఉంటే సీబీఎస్ఈ బోర్డు సైతం టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది బోర్డు. అయితే ఈ పరీక్షలను రద్దు చేయాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదని వారు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ వినతులను తెలిపారు. అయితే కరోనా కల్లోలం కొనసాగుతుండడంతో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుల న్యాయవాది మమతాశర్మ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. ఈ పిల్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. విచారణను జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, దినేశ్‌ మహేశ్వరి ధర్మాసనం ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు అందించాలని పిటిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. రేపు ఈ అంశంపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

    తాజాగా సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పొఖ్రియాల్ నిశాంక్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లో అయినా పరీక్షను నిర్వహిస్తామని ఆయన తేల్చి చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం సవాలుతో కూడుకున్న విషయమేనని మంత్రి అభిప్రాయపడ్డారు.

    అయితే విద్యార్థులకు 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు అత్యంత కీల‌క‌మ‌ని మంత్రి అన్నారు. ఇటీవల ప్రధాని ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీ నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపాయని మంత్రి వివరించారు. గతేడాది సైతం ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని.. అయినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా పరీక్షలను నిర్వహించామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published: