హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE, NEET, JEE పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

CBSE, NEET, JEE పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ, జేఈఈ మేయిన్స్, నీట్ తదితర పరీక్షలు రద్దు అవుతాయన్న ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాకల్(Union Education Minister Ramesh Pokhriyal Nishank) తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17న టీచర్లతో ఆన్లైన్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇంకా చదవండి ...

  సీబీఎస్ఈ, జేఈఈ మేయిన్స్, నీట్ తదితర పరీక్షలు రద్దు అవుతాయన్న ప్రచారం జరుగుతున్ననేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాకల్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17న టీచర్లతో ఆన్లైన్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు టీచర్లు హాజరు కావాలని కోరారు. డిసెంబర్ 10న పొఖ్రియాల్ విద్యార్థులు, టీచర్లు, పేరెంట్స్ తో ఆన్లైన్లో ఇంటరాక్ట్ అయ్యారు. సీబీఎస్(CBSE), NEET 2021, జేఈఈ2021 తదితర పరీక్షలపై సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. అయితే స్టూడెంట్స్ వెబినార్ నిర్వహించిన సమయంలో సీబీఎస్ 10, 12 బోర్డు పరీక్షలపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ పరీక్షలు మాత్రం 2021లో తప్పనిసరిగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

  విద్యార్థులు CBSE2021 పరీక్షలకు సిద్ధమవ్వాలని ఆయన సూచించారు. అయితే ఈ సమావేశంల జేఈఈ మెయిన్స్(JEE Mains) పరీక్ష పద్ధతిలో మార్పులు ఉంటాయని చెప్పారు. అయితే తాజా వెబినార్ లో మంత్రి పలు పరీక్ష తేదీలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తాజాగా చేసిన ట్వీట్ లో మంత్రి ఈ నెల 17 నిర్వహించనున్న వెబినార్ గురించి వెల్లడించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్ లైన్ ఇంటరాక్షన్ ఉంటుందని తెలిపింది.

  ఇదిలా ఉంటే.. ఓపెన్ డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్న వారికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పంది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరితేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎ‌ల్‌‌ఐ‌ఎస్సీ, ఎమ్మె‌ల్‌‌ఐ‌ఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టి‌ఫి‌కెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం చివరి తేదీని ఈ నెల 17 వరకు పొడి‌గిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.

  ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ www.braouonline.inను సందర్శించాలని సూచించింది. మరిన్ని వివ‌రా‌లకు సమీ‌ప అధ్యయన కేంద్రంలో సంప్రదించవ్చని పేర్కొంది. ఏమైనా సందేహాలు ఉంటే 73829 29570/580/ 590/600 లేదా యూనివర్సిటీ సమా‌చార కేంద్రం ఫోన్ నంబర్ 040–2368 0333/555ను సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.

  Official Website

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CBSE, Jee, NEET

  ఉత్తమ కథలు