ఇంటర్మీడియట్(Intermediate) పూర్తి చేసిన విద్యార్థులు(Students) వైద్యవిద్యలో చేరాలనుకుంటే.. దానికి ఎంట్రెన్స్ పరీక్షలు(Entrance Exams) రాయాల్సి ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంసెట్ పరీక్ష(Eamcet Exam) తప్పనిసరిగా రాయాలి. దీనిలో మంచి ర్యాంక్(Rank) సాధించిన వారు వైద్య విద్యలో రాణించవచ్చు. అంతే కాదు.. జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్లో(NEET) క్వాలిఫై అయితే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీటొస్తుంది. ఈ పరీక్షకు ఏటా లక్షలాది మంది పోటీపడుతుంటారు. అయితే ఇలా ర్యాంక్ తెచ్చుకున్న వారు .. దేశంలోని ఏ విశ్వవిద్యాలయాలో మంచి బోధన ఉంటుందో తెలియక ఇబ్బంది పుడుతుంటారు. ఏ విద్యాలయాలు వైద్య విద్యలో అగ్రస్థానంలో ఉన్నాయో తెలియక ఆందోళన పడుతుంటారు.
ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2022 (NIRF)ని ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం.. విద్యార్థులు భారతదేశంలోని టాప్ 10 మెడికల్ కాలేజీలలో ప్రవేశం పొందగలరు. మెడికల్ స్టడీస్‌లో కెరీర్‌ను కొనసాగించాలనుకునే విద్యార్థులకు ఈ జాబితా ఎతో ఉపయోగకరంగా ఉంటుంది.
NIRF ర్యాంకింగ్ 2022: టాప్ 10 మెడికల్ కాలేజీలు
1 - ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ.
2 - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్.
3 - క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు.
4 - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్, బెంగళూరు.
5 - సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో.
6 - అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు.
7 - బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి.
8 - జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరి.
9 - కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో.
10 - కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్.
12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడికల్ అనే రెండు బ్రాంచ్‌లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వీటిలో దేనిలోనైనా ప్రవేశం పొందాలంటే 12వ తరగతిలో మంచి మార్కులుతో పాటు.. ఎంట్రెన్స్ టెస్ట్ లో మంచి ర్యాంక్ సాధించాలి. వైద్యరంగంలో కెరీర్ అనేది చాలా మంది విద్యార్థుల కల. ఇందుకోసం విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే, వైద్య విద్యలో దేశంలోని ఏ యూనివర్సిటీలు అగ్రస్థానంలో ఉన్నాయో విద్యార్థులకు తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ ప్రకటించారు.
ఈ జాబితాలో వైద్య విద్యను అందిస్తున్న టాప్ టెన్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ జాబితా సంబంధిత విద్యార్థులు తమ సౌలభ్యం మేరకు యూనివర్సిటీని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. గత కొన్నేళ్లుగా వైద్యరంగం వేగంగా విస్తరిస్తోంది. నేటికీ అనేక ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాల అవసరం ఉన్నందున ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే.. స్పెషలైజేషన్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నందున.. విద్యార్థులు ఈ జాబితా నుండి విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో పరిశోధనా రంగంలో కూడా వారికి అవకాశాలు కల్పించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Medical colleges, NEET, NEET 2022