Home /News /jobs /

UNION BANK OF INDIA NOTIFICATION RELEASED FOR VARIOUS JOB VACANCIES DEC 29 IS LAST DATE FOR APPLICATIONS HERE FULL DETAILS NS

Bank Jobs 2021: నిరుద్యోగులకు అలర్ట్.. యూనియన్ బ్యాంక్ లో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు అలర్ట్.. యూనియన్ బ్యాంక్ లో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

నిరుద్యోగులకు అలర్ట్.. యూనియన్ బ్యాంక్ లో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 29ని లాస్ట్ డేట్ గా నిర్ణయించారు.

    ఇటీవల అనేక బ్యాంకులు (Banks) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను (Job Notification) విడుదల చేస్తూ ఉన్నాయి. తాజాగా ముంబాయి కేంద్రంగా పని చేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సినియర్ ఎగ్జిక్యూటీవ్/డొమైన్ ఎక్స్పెర్ట్స్ విభాగంలో నియామకాలు చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తుకు చివరి తేదీగా ఈ నెల 29ని నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

    ఖాళీల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో చీఫ్ రిస్క్ ఆఫీసర్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్, హెడ్ అనలిటిక్స్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. హెడ్-ఏపీఐ మేనేజ్మెంట్, హెడ్-డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.



































    పోస్టు ఖాళీలు
    చీఫ్ రిస్క్ ఆఫీసర్01
    చీఫ్ డిజిటల్ ఆఫీసర్01
    హెడ్ అనలిటిక్స్01
    చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్01
    హెడ్ ఏపీఐ మేనేజ్మెంట్01
    హెడ్ డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్ టెక్01
    మొత్తం06

    విద్యార్హతల వివరాలు: వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం నిర్ణయించారు. బీటెక్/బీఈ, గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఆ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయస్సు 35 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
    NHB Officer Recruitment 2021: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో మేనేజర్ జాబ్స్.. డిగ్రీ చేసిన వారికి ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు ముందుగా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ (https://www.unionbankofindia.co.in/english/home.aspx) ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Recruitments ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత మీకు Click here to view current Recruitmentపై క్లిక్ చేయాలి.
    Step 4: తర్వాత Click here for Notification, Click here to Apply Online అనే రెండు ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. తర్వాత Click here to Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Bank of Baroda Recruitment 2021: బీటెక్ చేసిన వారికి అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్

    Step 5: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం Registration Now! ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: దరఖాస్తు చేయాలనుకున్న పోస్టు, పేరు, తండ్రి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    Step 6: దీంతో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఆ వివరాలతో లాగిన్ అయ్యి దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
    Step 7: దరఖాస్తు అనంతరం భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank Jobs, Central Government Jobs, Union bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు