హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Communication Design: యూకే వర్సిటీ స్పెషల్ ప్రోగ్రామ్స్.. ఇండియాలో కమ్యూనికేషన్ డిజైన్‌ కోర్సులు.. వివరాలివే

Communication Design: యూకే వర్సిటీ స్పెషల్ ప్రోగ్రామ్స్.. ఇండియాలో కమ్యూనికేషన్ డిజైన్‌ కోర్సులు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ (ISCA).. భారతదేశంలో కమ్యూనికేషన్ డిజైన్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను లాంచ్ చేస్తోంది. ఇందుకు యూకే‌కు చెందిన లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ (LJMU)తో చేతులు కలిపింది.

ఇంకా చదవండి ...

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ (ISCA).. భారతదేశంలో కమ్యూనికేషన్ డిజైన్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను లాంచ్ చేస్తోంది. ఇందుకు యూకే‌కు చెందిన లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ (LJMU)తో చేతులు కలిపింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా బీఏ ఆనర్స్ కమ్యూనికేషన్ డిజైన్‌లో యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్, VFX, గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్, ఫోటోగ్రఫీ, UI/UX అండ్ అడ్వర్టైజింగ్‌లలో స్పెషలైజేషన్‌ కోర్సులను (Courses) అందించనున్నారు. అలాగే కమ్యూనికేషన్ డిజైన్‌లో ఎంఏ కోర్సులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

అర్హత ప్రమాణాలు

12వ తరగతి క్లియర్ చేసిన లేదా పరీక్షకు హాజరైన విద్యార్థులు BA (ఆనర్స్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్స్ కోర్సుల కోసం విద్యార్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్‌ను క్లియర్ చేసి ఉండాలి. కొచ్చి, బెంగళూరు కేంద్రంగా వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కర్ణాటక మంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానం-2020, ఎడ్యుకేషన్ అంతర్జాతీయీకరణకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు నైపుణ్యం ఉన్న డొమైన్‌ను గుర్తించి సహకరించుకోవడానికి ద్వారాలు తెరిచిందన్నారు. ఈ ప్రోగ్రామ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో కెరీర్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుందన్నారు.

Job Guarantee Programme: గ్రాడ్యుయేట్స్‌కు గుడ్ న్యూస్.. డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ప్రారంభం..

మరోవైపు, ప్రతిష్టాత్మక ఐఐటీల్లో డిజైన్ సంబంధిత కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థులు కొత్త ఫార్మాట్ ఆధారంగా ప్రవేశ పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుందని ఐఐటీ బాంబే తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షలకు కూడా ఇది వర్తించనుందని పేర్కొంది. CEED, UCEED - పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ డిజైన్ ప్రవేశ పరీక్షలు కొత్త సిలబస్‌ ఆధారంగా కొత్త ఫార్మాట్‌లో జరుగుతాయని పరీక్షలు నిర్వహించే సంస్థ ఐఐటీ బాంబే స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త సిలబస్ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉందని తెలిపింది. ఈ మార్పులు 2024 అడ్మిషన్లకు వర్తిస్తాయని.. ఈ ఏడాది మాత్రం పాత పద్దతిలోనే ప్రవేశ పరీక్ష జరగనుందని ఐఐటీ బాంబే స్పష్టం చేసింది.

Back-End Developers: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కు వెన్నెముకగా బ్యాక్ ఎండ్ డెవలపర్స్.. సాఫ్ట్‌వేర్‌లో వీరి ప్రాధాన్యం ఏంటంటే?

CEED, UCEED అనేవి IITలలో డిజైన్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు. UCEED ద్వారా అభ్యర్థులు IIT బాంబే, గౌహతి, ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్, జబల్పూర్ (IIITDMJ)లో BDes (బ్యాచిలర్ ఆఫ్ డిజైన్) కోర్సుల్లో ప్రవేశానికి షార్ట్ లిస్ట్ కానున్నారు. MDes (మాస్టర్ ఆఫ్ డిజైన్) లేదా Phd ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు CEED పరీక్ష రాయాల్సి ఉంటుంది. UCEED లేదా CEED స్కోర్.. ఫలితాల ప్రకటన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు కానుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు