Home /News /jobs /

UK GOOD NEWS FOR INDIAN STUDENTS ANNOUNCEMENT OF SCHOLARSHIPS FOR HIGHER EDUCATION IN THE UK GH VB

Scholarships: ఇండియన్ స్టూడెంట్స్‌కు బ్రిటన్ గుడ్ న్యూస్.. యూకేలో ఉన్నత విద్యకోసం స్కాలర్ షిప్‌ల ప్రకటన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూకేలో ఉన్నత విద్య పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు బ్రిటిష్ కౌన్సిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్ వివిధ అధ్యయన రంగాల్లో భారతీయ విద్యార్థుల కోసం కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
విదేశీ విద్య అనగానే భారీ ఫీజులు, హెవీ కాస్ట్ ఆఫ్‌లింగ్ గుర్తుకొస్తాయి. దీంతో విదేశీ యూనివర్సిటీల్లో(Universities) చదువుకోవాలని ఉన్నా..చాలా మంది వెనుకడుగు వేస్తారు. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం ఆయా దేశాల్లో పలు స్కాలర్‌షిప్స్‌(Scholarships) అందుబాటులోకి వచ్చాయి. అకడమిక్‌ రికార్డ్, నిర్ణీత టెస్ట్‌ స్కోర్లలో(Test Scores) ప్రతిభతోపాటు విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకుంటే చాలు.. స్కాలర్‌షిప్‌ మీ సొంతం అవుతుంది. దీంతో ఫీజుల ఆందోళనకు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. విదేశీ విద్య స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చు. యూకేలో(UK) ఉన్నత విద్య పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు బ్రిటిష్ కౌన్సిల్(British Council) గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్ వివిధ అధ్యయన రంగాల్లో భారతీయ విద్యార్థుల కోసం కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. వ్యాపారం, ఆర్థికం, హ్యుమానిటీస్, మనస్తత్వ శాస్త్ర వ్యవస్థాపకత, డిజైన్, మార్కెటింగ్, HR, సంగీతం వంటి తదితర రంగాల్లో అధ్యయనం కోసం 20 స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. యూకే వ్యాప్తంగా ఉన్న 16 యూనివర్సిటీల్లో అభ్యర్థులు అడ్మిషన్ పొందవచ్చు.

వీటికి అదనంగా జస్టిస్ అండ్ లా డిపార్ట్‌మెంట్‌లో మరో ఏడు స్కాలర్ షిప్‌లను భారతీయ విద్యార్థుల కోసం కేటాయించారు. మానవ హక్కులు, క్రిమినల్ జస్టిస్, వాణిజ్య చట్టం వంటి సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం దరఖాస్తుచేసుకునే విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్‌లు వర్తించనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన ఏడు లా స్కూల్స్‌లో యూకే ఒకటి. UK ప్రభుత్వమైన గ్రేట్ బ్రిటన్ క్యాంపెయిన్‌తో బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఇందుకోసం యూకేలోని యూనివర్సిటీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Mega Job Mela: నిరుద్యోగులకు శుభవార్త..హైదరాబాద్ లో రేపు మెగా జాబ్‌ మేళా.. వివరాలిలా..

భారత్, యూకేల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా భారతీయ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు మంజూరు చేస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది. ప్రతి స్కాలర్ షిప్ 10వేల పౌండ్ల విలువైనది. ఈ మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తిచేయడానికి అవసరమయ్యే ట్యూషన్ ఫీజు కోసం కేటాయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్కాలర్ షిప్‌ల నమోదు కోసం https://www.britishcouncil.in/study-uk/scholarships/great-scholarships వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అదే విధంగా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్‌ కోసం యూకేలోని రెండు బెస్ట్ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీ కోసం భారతీయ ఇంగ్లీష్ ఉపాధ్యాయుల కోసం మరో ఆరు స్కాలర్ షిప్‌లను ప్రకటించింది బ్రిటిష్ కౌన్సిల్. భారతదేశంలోని ప్రాథమిక లేదా మాధ్యమిక ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న ఇంగ్లీష్ టీచర్లకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని బ్రిటిష్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌లు తరగతి గదుల్లో అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవటానికి టీచర్లకు అనుమతి ఇస్తుంది.

మొత్తం ఆరు స్కాలర్‌షిప్‌ల్లో మూడు లీడ్స్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఫేస్ టూ ఫేస్ /పుల్ టైమ్ MA ప్రోగ్రామ్ కోసం ఈ స్కాలర్ షిప్‌లను కేటాయించనున్నారు. మరో మూడు స్టిర్లింగ్ యూనివర్సిటీ అందించే ఆన్‌లైన్/పార్ట్ టైమ్ MSc ప్రోగ్రామ్‌ కోసం కేటాయించారు. అలాగే రెండు వారాల పాటు పూర్తి-నిధులతో కూడిన రెసిడెన్షియల్ సందర్శనకు అవకాశం ఉంటుంది. స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడానికి ముందు యూనివర్సిటీల నుంచి ఆఫర్‌ను పొందాలని.. ఇందుకు రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది.
Published by:Veera Babu
First published:

Tags: British council, Career and Courses, Higher education, Uk, University exams

తదుపరి వార్తలు