Home /News /jobs /

Telangana - Tide: తెలంగాణలో విస్తరణకు ముందుకొచ్చిన ప్రముఖ సంస్థ.. ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయంటే..

Telangana - Tide: తెలంగాణలో విస్తరణకు ముందుకొచ్చిన ప్రముఖ సంస్థ.. ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో విస్తరణకు మరో ప్రముఖ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతో పాటు.. ఉద్యోగాలు కూడా రానున్నాయి.

  మరో ప్రముఖ సంస్థ తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పెంచేందుకు సిద్ధమైంది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ అయిన టైడ్‌ భారత్ ను తన మొదటి ఇంటర్నేషనల్ మార్కెట్ గా ఎంచుకుంది. హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే టైడ్ సంస్థకు హైదరాబాద్ నగరంలో ఓ టెక్నాలజీ సెంటర్ ఉంది. తాజాగా మరో రూ. వేయి కోట్ల పెట్టుబడికి సిద్ధమైంది సంస్థ. ఈ సంస్థ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు ఆర్థిక, పరిపాలనాపరమైన సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, మార్కెటింగ్‌, ఫీల్డ్‌ టీమ్స్‌లో మరో వేయి మందిని నియమించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మరో 600 మందిని నూతనంగా చేర్చుకోవాలని భావిస్తోంది సంస్థ. గత సంవత్సరం హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ లో 200 మంది పని చేస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మొత్తం 800లకు చేరనుంది.
  AP Jobs: ఏపీలో డిప్లొమో, డిగ్రీ, పీజీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

  ఈ సందర్భంగా టైడ్ ఇండియా సీఈఓ గుర్జోధ్ పాల్ మాట్లాడుతూ.. 100 మిలియన్‌ పౌండ్ల మేర నిధులనూ సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. తొలుత భారత మార్కెట్‌లో తమ సేవలను విస్తరించాలని టైడ్‌ నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. వినూత్న వ్యాపార బ్యాంకింగ్ పరిష్కారాలతో భారతదేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. కరోనా మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక పునరుద్ధరణకు మద్దతు ఇస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల టైడ్ ఆర్బీఐ బ్యాంక్ తో ఆర్బీఎల్ బ్యాంక్ (RBL బ్యాంక్) తో ఒప్పందం కుదుర్చుకుంది. టైడ్ ఇండియాకు బ్యాంక్ అకౌంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఆర్బీఎస్ అందిస్తోంది.

  ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటాన్ ఈవీ, గురువారం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో సూమారు రూ.2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. గురువారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావుతో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించింది.

  భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు. తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మంత్రి కేటీఆర్ కి తెలిపింది.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Investment Plans, Jobs in telangana, Software developer, Telangana

  తదుపరి వార్తలు