యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా - యూఐడీఏఐ (UIDAI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటనలను (Job Notifications) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ నగరాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసింది సంస్థ. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. కింద ఎంబేడ్ చేసిన ట్వీట్లలోని QR కోడ్ ను స్కాన్ చేసి అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి చేయొచ్చు.
#Recruitment #UIDAI is looking for passionate professionals for the position of Assistant Manager at UIDAI, MUMBAI RO Team to strengthen its team. Please read the job description in detail before applying. UIDAI is an equal-opportunity employer. pic.twitter.com/vb4qAheM4i
— Aadhaar (@UIDAI) November 10, 2022
Assistant Manager: యూఏడీఏఐ, ముంబాయి ఆర్ఓ లో ఈ ఖాళీలు ఉన్నాయి. బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ (కంప్యూటర్ అప్లికేషన్స్) అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు BOEACC/సిస్టెమ్స్ డవలప్మెంట్/GNIIT లో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారు ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.
Railway Jobs 2022: ఇండియన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా జాబ్స్ .. దరఖాస్తుకు మరో 5 రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
#Recruitment #UIDAI is looking for passionate professionals for the position of Assistant Manager at UIDAI, Hyderabad Legal Team to strengthen its team. Please read the job description in detail before applying. UIDAI is an equal-opportunity employer. pic.twitter.com/1a8kza7Ju2
— Aadhaar (@UIDAI) November 10, 2022
Assistant Manager (UIDAI, Hyderabad Legal Team): హైదరాబాద్ లీగల్ టీం లో పని చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది UIDAI. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు LLB చేసి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారు 5 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.
#Recruitment #UIDAI is looking for passionate professionals for the position of Assistant Manager at UIDAI, Guwahati (RO) to strengthen its team. Please read the job description in detail before applying. UIDAI is an equal-opportunity employer. pic.twitter.com/q5lhtWSjjJ
— Aadhaar (@UIDAI) November 10, 2022
Project Manager (Gawhati): ఈ విభాగంలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్/ఎంసీఏ చేసి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటింది.
#Recruitment #UIDAI is looking for passionate professionals for the position of Assistant Manager – IT Assets, at UIDAI Tech Centre – Bangalore to strengthen its team. Please read the job description in detail before applying. UIDAI is an equal-opportunity employer. pic.twitter.com/o6coo6q7YT
— Aadhaar (@UIDAI) November 10, 2022
అసిస్టెంట్ మేనేజర్-IT Assets: సంబంధిత విభాగంలో మూడేళ్ల అనుభవం కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AADHAR, Central Government Jobs, JOBS, UIDAI