Home /News /jobs /

UIDAI RECRUITMENT 2021 UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA RELEASED JOB NOTIFICATION FOR VARIOUS POSTS KNOW VACANCIES IN HYDERABAD SS

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

UIDAI Recruitment 2021 | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI హైదరాబాద్‌తో పాటు పలు రీజనల్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    భారత పౌరులకు ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని 6 ప్రాంతాల్లో ఉన్న రీజనల్ ఆఫీసుల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో యూఐడీఏఐ రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసుల్లో ఉన్న ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది యూఐడీఏఐ. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ లాంటి పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్ ఆఫీసులో 2 ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. వేర్వేరు రీజనల్ ఆఫీసులకు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏ రీజనల్ ఆఫీసులోని పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆ ఆఫీసుకి మాత్రమే దరఖాస్తులు పంపాలి.

    UIDAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 15
    ప్రైవేట్ సెక్రెటరీ- 7 (హైదరాబాద్-2, చండీగఢ్-3, ఢిల్లీ-1, లక్నో-1)
    డిప్యూటీ డైరెక్టర్- 3 (చండీగఢ్-1, ముంబై-1, రాంచీ-1)
    అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్- 2 (ఢిల్లీ-1, రాంచీ-1)
    సెక్షన్ ఆఫీసర్- 3 (ఢిల్లీ-1, లక్నో-2)

    Army Jobs 2021: డిగ్రీ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    IDBI Bank Jobs 2021: ఐడీబీఐ బ్యాంకులో 920 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు


    UIDAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 23
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    దరఖాస్తు విధానం- https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
    హైదరాబాద్‌లోని పోస్టులకు దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్:
    Assistant Dircetor, General (HR),
    Unique Identification Authority of India (UIDAI),
    Regional Office, 6th Floor,
    East Block, Swarna Jayanthi Complex,
    Beside Maitrivanam,
    Ameerpet, Hyderabad- 500038
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, Andhra Pradesh Government Jobs, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana government jobs, Telangana jobs, UIDAI, Upcoming jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు