Home /News /jobs /

UIDAI RECRUITMENT 2021 UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA RELEASED JOB NOTIFICATION FOR 25 VACANCIES SS

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

UIDAI Recruitment 2021: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

UIDAI Recruitment 2021 | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

    భారత పౌరులకు ఆధార్ కార్డు సేవల్ని అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబై, బెంగళూరు, గువాహతిలోని ప్రాంతీయ కార్యాలయాల్లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ప్రైవేట్ సెక్రెటరీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది UIDAI. డిప్యూటేషన్ మూడేళ్లు ఉంటుంది. సంస్థ అవసరాలను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుల్ని పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపించాలి.

    UIDAI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 25
    డిప్యూటీ డైరెక్టర్- 3
    సెక్షన్ ఆఫీసర్- 5
    అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5
    సీనియర్ అకౌంట్ ఆఫీసర్- 1
    అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- 1
    అకౌంటెంట్- 2
    ప్రైవేట్ సెక్రెటరీ- 6
    స్టెనో- 2

    NISER Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Post Office Jobs: పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    UIDAI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 మే 17
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 16
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    వయస్సు- 18 నుంచి 56 ఏళ్లు
    ఎంపిక విధానం- విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

    Railway Jobs 2021: రైల్వేలో 3378 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    NIMHANS Recruitment 2021: నిమ్‌హాన్స్‌లో 275 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    UIDAI Recruitment 2021: దరఖాస్తు విధానం


    అభ్యర్థులు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.
    ముంబై, బెంగళూరు, గువాహతి ప్రాంతీయ కార్యాలయాల్లో పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఉన్నాయి.
    దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పోస్టులో పంపాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్‌లు కూడా వేర్వేరుగా ఉన్నాయి.
    Bengaluru: Assistant Director General (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, 3rd Floor, South Wing, Khanija Bhavan, No. 49, Race Course Road, Bengaluru 560001.

    Mumbai: Assistant Director General (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, 7th Floor, MTNL Telephone Exchange, GD Somani Marg, Cuffe Parade, Colaba, Mumbai – 400 005.

    Guwahati: Assistant Director General (HR), Unique Identification Authority of India (UIDAI), Regional Office, Block-V, 1 st Floor, Housefed Complex, Dispur, Guwahati -781006.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs

    తదుపరి వార్తలు