యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశంలో పలుచోట్ల ఉన్న రీజనల్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రెటరీ లాంటి పోస్టుల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) రిలీజ్ చేసింది. భారత పౌరులకు ఆధార్ కార్డులు (Aadhaar Card) జారీ చేసే సంస్థ అయిన యూఐడీఐఏకి (UIDAI) హైదరాబాద్, చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రీజనల్ ఆఫీసులో కేవలం 2 ప్రైవేట్ సెక్రెటరీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 15 |
ప్రైవేట్ సెక్రెటరీ | 7 (హైదరాబాద్-2, చండీగఢ్-3, ఢిల్లీ-1, లక్నో-1) |
డిప్యూటీ డైరెక్టర్ | 3 (చండీగఢ్-1, ముంబై-1, రాంచీ-1) |
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ | 2 (ఢిల్లీ-1, రాంచీ-1) |
సెక్షన్ ఆఫీసర్ | 3 (ఢిల్లీ-1, లక్నో-2) |
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 23
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
వేతనం- పే మ్యాట్రిక్స్ లెవెల్ 8 వర్తిస్తుంది.
వయస్సు- 56 ఏళ్ల లోపు
Income Tax Jobs 2021: రూ.1,42,000 వేతనంతో ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం
Step 1- అభ్యర్థులు https://uidai.gov.in/ వెబ్సైట్లో Work With UIDAI సెక్షన్లో Deputation/Contract పైన క్లిక్ చేయాలి.
Step 2- వేర్వేరు రీజనల్ ఆఫీసులకు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి.
Step 3- నోటిఫికేషన్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేయాలి.
Step 4- అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
Step 5- ఏ రీజనల్ ఆఫీసులో పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్‌కు మాత్రమే అప్లికేషన్స్ పంపాలి.
హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చండీగఢ్ రీజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఢిల్లీ రీజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముంబై రీజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లక్నో రీజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాంచీ రీజనల్ ఆఫీస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హైదరాబాద్‌లోని పోస్టులకు దరఖాస్తుల్ని పంపాల్సిన అడ్రస్:
Assistant Dircetor, General (HR),
Unique Identification Authority of India (UIDAI),
Regional Office, 6th Floor,
East Block, Swarna Jayanthi Complex,
Beside Maitrivanam,
Ameerpet, Hyderabad- 500038.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, Aadhaar card, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, UIDAI