Jobs: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

UIDAI Recruitment 2020 | ఆధార్ సంస్థలో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 27, 2020, 3:35 PM IST
Jobs: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
Jobs: ఆధార్ సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. ఆధార్ సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్-జనరల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలను ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, లక్నో, గువాహతి, చండీగఢ్‌లో పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

UIDAI Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే



మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ పోస్టులు- 14
విద్యార్హత- పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అనుభవం తప్పనిసరి.
వయస్సు- 56 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:ADG (IIR),
Unique Identification Authority of India (uidai),
4th Floor,
Bangla Sahib Road,
Behind Kali Mandir,
Gole Market,
New Delhi-110001.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Scholarship: ఫారిన్‌లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్... అప్లై చేయండిలా

Jobs: బీటెక్ అర్హతతో 259 ఉద్యోగాలు... మే 30 చివరి తేదీ

Jobs: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో 114 ఉద్యోగాలు... డిప్లొమా, డిగ్రీ అర్హత
Published by: Santhosh Kumar S
First published: May 27, 2020, 3:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading