Home /News /jobs /

UGC TO LET 900 AUTONOMOUS COLLEGES OFFER ONLINE DEGREE COURSES GH VB

Online Degree Courses: ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను యూజీసీ సిద్ధం.. దేశవ్యాప్తంగా 900 కళాశాలల్లో అందుబాటులోకి..!

ప్రతీకాత్మక చిత్రం (Photo Credit : Instagram)

ప్రతీకాత్మక చిత్రం (Photo Credit : Instagram)

విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- యూజీసీ కీలక నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా ఉన్న 900 కళాశాలల ద్వారా విద్యార్థులకు వివిధ ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను అందించనుంది.

కరోనా(Corona) కాలంలో దేశంలో వివిధ రంగాలతోపాటు విద్యారంగంలోనూ కీలక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఆన్‌లైన్‌ విద్యావిధానంలో దాదాపు రెండు ఏళ్లు విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. పరీక్షలు కూడా ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. అయితే ఇప్పుడు మరో కీలక మార్పును యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ తీసుకురానుంది. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో డిగ్రీ(Degree) కోర్సులను అందించనుంది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 900 కళాశాలలు ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులు(Online Degree Courses) అందించనున్నాయి. దీనిద్వారా విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభించనున్నాయి. ఆయా కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నుంచి ప్రత్యేక అనుమతి అవసరం లేకున్నా.. ముందస్తుగా విడుదల చేసిన నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- యూజీసీ (UGC- University Grants Commission) తాజా నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా ఉన్న 900 కళాశాలల(Colleges) ద్వారా విద్యార్థులకు వివిధ ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను (Online Degree Courses) అందించనుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థులకు చదువుకొనేందుకు విస్తృత అవకాశాలు దక్కుతాయి. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-ఎన్‌ఈపీ(NEP-2020)లో భాగంగా ఆన్‌లైన్‌ విద్యను అందించేందుకు యూజీపీ మార్గం సుగమం చేసింది. ఇకపై విద్యార్థులు ఉన్నచోట నుంచే దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న కళాశాలల నుంచి డిగ్రీలు అందుకొనే వీలు కలగనుంది.

AP Inter 1st Year: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ సిలబస్ ఇదే

ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ కోర్సులను నిర్వహించే అవకాశం కేవలం విశ్వవిద్యాలయాలకు మాత్రమే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కల్పించింది. అయితే తాజాగా తీసుకొన్న నిర్ణయంతో అటానమస్‌ కళాశాలలకూ అవకాశం దక్కుతోంది. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌(NAAC) గ్రేడ్‌ కనీసం 3.26 ఉన్న కళాశాలలకు అనుమతి దక్కుతుంది. అదే విధంగా సబ్జెక్ట్‌ క్యాటగిరీలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(NIRF) విడుదల చేసిన మూడు ర్యాంకింగ్స్‌లో కనీసం రెండు సార్లు చోటు సంపాదించి ఉండాలి. ఈ నిబంధనలకు లోబడి దాదాపు 900 కళాశాలలు కొత్తగా ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులు అందించనున్నాయి. ఆయా కళాశాలలకు ప్రత్యేకంగా యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేకున్నా కచ్చితంగా నిబంధనలు పాటించాలి.

ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులకు హాజరయ్యే విద్యార్థులు 12వ తరగతి కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి. యూజీ, పీసీ కోర్సుల్లో చేరే విద్యార్థులు యూజీసీ మేరకు అవసరమైన అన్ని అర్హతలను కలిగి ఉండాలని సమాచారం. విద్యార్థులను ‘ద నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA)’ ఆన్‌లైన్‌ పరీక్షలు లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేయనుంది. సాధారణ డిగ్రీ కోర్సుల తరహాలోనే ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులలో కూడా తప్పనిసరిగా 75 శాతం హాజరు (Attendance) సాధించాలి.

TS 10th Exams: తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే

సాధారణ డిగ్రీ కోర్సులకు ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కేవలం ఆన్‌లైన్‌ తరహా అనే కాకుండా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆన్‌లైన్‌ కోర్సులు విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇతర ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మార్చి 2022లో ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ప్రకటించనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Apply online, Career and Courses, Coursers, Degree students, EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు