హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC: విద్యార్థులు, స్టాఫ్ ఫిర్యాదుల పరిష్కారానికి యూజీసీ చర్యలు.. త్వరలో ఆ పోర్టల్‌ ప్రారంభం..

UGC: విద్యార్థులు, స్టాఫ్ ఫిర్యాదుల పరిష్కారానికి యూజీసీ చర్యలు.. త్వరలో ఆ పోర్టల్‌ ప్రారంభం..

UGC to Launch Portal e-Samadhan

UGC to Launch Portal e-Samadhan

UGC: ఈ సింగిల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అనేక రకాల ఫిర్యాదులను విద్యార్థులు ఫైల్ చేయవచ్చు. సరైన డాక్యుమెంటేషన్, డాకెట్ నంబర్ల కారణంగా ఫిర్యాదుల పురోగతిని ట్రాక్ చేయడం సులభం అవుతుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ విద్యార్థులు (Students), స్టాఫ్ (Staff) నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం కోసం ‘ఇ-సమాధాన్’ (e-Samadhan) అనే కేంద్రీకృత పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇది వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ‘ఇన్‌స్టిట్యూషనల్ గ్రీవెన్స్ అనేది కమిషన్ ముఖ్యమైన ప్రాధాన్యతగా ఉంటుంది. ఈ మేరకు యూజీసీ ఇ-సమాధాన్ ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిజిస్టరింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్‌తో ముందుకు రానుంది. ఇది పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్ లేదా ఎంక్వైరీస్ కోసం దీన్ని ఏర్పాటు చేస్తున్నాం’ అని యూజీసీ అధికారులు తెలిపారు.ఈ ప్లాట్‌ఫారమ్‌ను పారదర్శకంగా అమలు చేయడానికి, ఉన్నత విద్యా సంస్థల్లో అక్రమాలను నిరోధించడానికి, ఫిర్యాదుల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన మెకానిజమ్‌తో అందుబాటులోకి తీసుకురానున్నారు. యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ మినహా, ప్రస్తుతం ఉన్న పోర్టల్స్, హెల్ప్‌లైన్‌లను యూజీసీ విలీనం చేసింది. వీటి స్థానంలో కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేసిందని అధికారులు తెలిపారు.


“యూజీసీ ఇ-సమాధాన్‌ను స్టేక్‌హోల్డర్స్ సర్వీస్ కోసం ఏర్పాటు చేయనున్నారు. ఫిర్యాదులను పోర్టల్‌లో నమోదు చేయడానికి ఇది సింగిల్ విండో సిస్టమ్‌గా పనిచేయనుంది. సింగిల్ మౌస్ క్లిక్‌తో ఎల్లప్పుడూ ఇది అందుబాటులో ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెం.1800-111-656 తోపాటు, యూజీసీ వెబ్‌సైట్ 24×7లో అందుబాటులో ఉంటుంది.’’ అని అధికారులు తెలిపారు.
మెయిల్ ఐడీ సహాయంతో లేదా టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కూడా బాధితులు తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. “చేసిన ఫిర్యాదు రికార్డ్ అవుతుంది. సంబంధిత బ్యూరో హెడ్ అకౌంట్‌కు ఆటోమెటిక్‌గా ప్రతిబింబించే డాకెట్ నంబర్ కేటాయిస్తారు. దీంతో సంబంధిత బ్యూరో నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరిస్తుంది.’’ అని అధికారులు తెలిపారు.
సమర్థవంతంగా అమలు చేయడం కోసం సంబంధిత బ్యూరో హెడ్ రోజువారీ ప్రాతిపదికన ఫిర్యాదులను సమీక్షిస్తారు. ఇక కార్యదర్శి లేదా చైర్మన్ వారానికి ఒకసారి సమీక్షించనున్నారు.
ఇది కూడా చదవండి : ఇంగ్లీష్ ఇడియమ్స్ అంటే ఏంటి..? వీటిని ఎప్పుడు వాడాలి..? ఉదాహరణలు చూడండి..


ఈ సింగిల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అనేక రకాల ఫిర్యాదులను విద్యార్థులు ఫైల్ చేయవచ్చు. సరైన డాక్యుమెంటేషన్, డాకెట్ నంబర్ల కారణంగా ఫిర్యాదుల పురోగతిని ట్రాక్ చేయడం సులభం అవుతుంది. ఫిర్యాదులపై స్పందించని సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది యూజీసీకి ఎంతో సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఇంతకుముందు, సింగిల్ విండో సిస్టమ్ అందుబాటులో లేకపోవడంతో, విద్యార్థులు అనేక చోట్ల ఫిర్యాదులను చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో పరిష్కార యంత్రాంగం నెమ్మదిగా పనిచేస్తుండేది. ఇది స్టేక్ హోల్డర్స్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తుండేది. అయితే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కేంద్రీకృత పోర్టల్ అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో 1043 యూనివర్సిటీలు, 42,343 కళాశాలలు, 3.85 కోట్ల మంది విద్యార్థులతో పాటు 15.03 లక్షల ఉపాధ్యాయులు ఉన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, UGC

ఉత్తమ కథలు