దేశంలోని అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాలలో నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను (Four Year Undergraduate Programmes) అమలు చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఇందు కోసం కేంద్ర విశ్వవిద్యాలయాలతో UGC చర్చలు జరిపింది. త్వరగా ఎఫ్‌వైయూపీ (FYUP) విధానం అమలు చేసేందుకు చక్కని ప్రణాళికను ప్రారంభించాలని కేంద్ర యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌లను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) కోరింది. ఈ ప్రక్రియ వేగంగా సజావుగా అమలు చేయడానికి యూనివర్సిటీలు చొరవ చూపి చర్చలు చేయాలని ఐఏఎన్ఎస్ (IANS) నివేదించింది. సెంట్రల్ యూనివర్సిటీ (Central universities) లు తమ రెగ్యులర్ మూడు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లను FYUP తో పాటు నిర్వహించడానికి అనుమతించబడతాయి. విద్యార్థులకు బహుళ ఎంట్రీలు మరియు నిష్క్రమణ వ్యవస్థల ఎంపిక కూడా అందించబడుతుంది.
వచ్చే ఏడాది నుంచి అమలు చేయండి..
విద్యార్థులు డిగ్రీ లేదా కోర్సును వదిలి, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యార్థి విద్యను మధ్యలో ఆపేస్తే వారు ఆపివేసిన సంవత్సరం నుంచి లేదా సెమిస్టర్ (Semester) నుంచి తిరిగి చదువులో చేరవచ్చుని కేంద్రం పేర్కొంది. నాలుగేళ్ల కోర్సు విధానం తయారీపై ఎలా చేయూఆలో యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌లతో అన్నారు.
ఈ విధానం అమలు వచ్చే ఏడాది నాటికి ఆయా యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తితో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుందని అయినప్పటికీ అన్ని వ్యవస్థలను సమన్వయ పరుచొని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
2013లోనే ప్రయత్నం..
తదుపరి విద్యా సెషన్ నుంచి ఎఫ్‌వైయూపీ (FYUP) ని ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో నికేంద్ర విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్సలర్‌లతో కేంద్ర విద్యా మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ విధానాన్ని కేంద్ర విద్యాశాఖ 2013లోనే ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అప్పుడు అనేక మంది విద్యార్థులు, విద్యావేత్తల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. విద్యా మంత్రిత్వ శాఖ 2013 లో కూడా ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రయత్నించింది.
అయితే అనేక మంది విద్యార్థులు మరియు విద్యావేత్తల నుండి నిరసనలను ఎదుర్కొన్నారు, సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాలు చదువు ఆచరణలో కష్టసాధ్యమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నూతన విద్యా విధానంతో మార్పులు..
ఈసారి జాతీయ విద్యా విధానం (NEP) 2020 కింద, సాధారణంగా మూడేళ్ల UG కోర్సు, రెండేళ్ల PG కోర్సు ఉంటుందని, ప్రత్యామ్నాయంగా నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు జత చేస్తున్నట్టు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఢిల్లీ యూనివర్సిటీ (DU) కూడా ఈ విధానాన్ని అవలంబించాలని యోచిస్తోందని, డీయూ (DU) కి కొత్తగా నియమితులైన వైస్-ఛాన్సలర్, యోగేష్ సింగ్ తెలిపారు. విద్యార్థులు ఇప్పుడు మూడేళ్ల హానర్స్ లేదా నాలుగు సంవత్సరాల హానర్స్ డిగ్రీ లేదా రీసెర్చ్‌తో కూడిన విభాగంలో నాలుగు సంవత్సరాల ఆనర్స్ కావాలా అని ఎంచుకునే అవకాశం ఉంటుందని డీయూ వీసీ వెల్లడించారు. ఎఫ్‌వైయూపీ విధానంలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా పాఠ్యాంశాలను రూపొందిస్తామని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.