Ph.D: అసిస్టెంట్ ప్రొఫెసర్లకు Ph.D అర్హత నిబంధన అమలుపై యూజీసీ ఏం చెబుతోంది.. జాప్యానికి గల కారణం అదేనా..

ప్రతీకాత్మక చిత్రం

Ph.D: అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి Ph.D అర్హత తప్పనిసరి చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్(UGC) తీసుకొచ్చిన పాలసీ ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ పాలసీని ఆమోదించి మూడేళ్లు అయినా, అమలులో జాప్యం చేస్తున్నారు. అయితే ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై సమాలోచనలు జరుపుతున్నామని యూజీసీ సెక్రటరీ తెలిపారు.

  • Share this:
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి Ph.D అర్హత తప్పనిసరి చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్(UGC) తీసుకొచ్చిన పాలసీ ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ పాలసీని ఆమోదించి మూడేళ్లు అయినా, అమలులో జాప్యం చేస్తున్నారు. అయితే ఈ అంశం పరిశీలనలో ఉందని, దీనిపై సమాలోచనలు జరుపుతున్నామని యూజీసీ సెక్రటరీ తెలిపారు. యూనివర్సిటీలు-కళాశాలల్లో అధ్యాపకులు, ఇతర అకడిమిక్ సిబ్బంది నియామకానికి కనీస అర్హత, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణ కోసం ఈ నిబంధనలను యూజీసీ 2018లో ఆమోదించింది. అయితే దీన్ని వెంటనే అమలు చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోకూడదని యూజీసీ భావించింది. దీంతో Ph.D పూర్తి చేయడానికి మూడు సంవత్సరాల సమయాన్ని వినియోగించుకోవాలని తెలిపింది. అయితే ఈ పాలసీ అమలు గడువును పొడిగించాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చాయి.

ఎన్ఈటీ అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలని కోరుతూ ఎంపీలు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు పంపారు. దీనికి మహమ్మారి కూడా తోడవ్వడంతో ఈ నిబంధనను అమలు చేసే వ్యవధిని మరింత పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 మార్చిలో దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ విధించిన కారణంగా అభ్యర్థులు రిసెర్చ్ చేయలేకపోయారు. ఈ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని డాక్టోరల్ థిసీస్‌ను ఆలస్యంగా సమర్పించేందుకు యూజీసీ అనుమతిచ్చింది.

పాత నిబంధనల్లో ఏముంది?
ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం నెట్ (ఎన్ఈటీ), సెట్ (ఎస్ఈటీ), స్లెట్ (ఎస్ఎల్ఈటీ) సహా ఉపాధ్యాయ ఎలిజిబిలిటీ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ పోస్టుకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా Ph.D డిగ్రీని తప్పనిసరి చేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం Ph.D పట్టా పొందిన అభ్యర్థులకు NET/SLET/SETకి సంబంధించిన కనీస అర్హత నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్‌డీ తప్పనిసరి చేయడానికి యూజీసీ తేదీని పొడిగిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు యూజీసీ తాజాగా ప్రకటించింది.
Published by:Veera Babu
First published: