దేశంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(UGC) ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రిసెర్చ్ స్కాలర్స్‌కు(Research Scholars) అవసరమైన సదుపాయాలను కల్పించాలని అన్ని విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. శోధ్ చక్ర(Shodh Chakra) పేరుతో చేపట్టే ప్రత్యేక కార్యక్రమం ద్వారా పరిశోధక విద్యార్థులకు ప్రత్యేక సదుపాయాలను అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ మాట్లాడుతూ.. పరిశోధక విద్యార్థులు, సూపర్వైజర్లు శోధ్ చక్ర ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(UGC-University Grants Commission) రిసెర్చ్ స్కాలర్స్ (Research Scholars ), పరిశోధనలు చేస్తున్న సూపర్వైజర్లకు(Supervisors) సహాయపడాలనే లక్ష్యంతో ‘శోధ్ చక్ర’ (Shodh Chakra) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ (INFLIBNET) సెంటర్‌తో కలిసి అందుబాటులోకి తీసుకొచ్చింది. రిసెర్చ్ స్కాలర్స్ తమ రిసెర్చ్ వర్క్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి సదుపాయాలు కల్పించడం శోధ్ చక్ర ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. శోధ్ చక్ర ప్రోగ్రామ్ వర్చువల్‌గా 2022 మే 10 మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభ వర్చువల్ ఈవెంట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
పరిశోధనలు చేసే విద్యార్థులకు అవసరమైన వనరులను అందించడం, గైడ్, విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్, వర్క్ ప్రోగ్రెస్ ట్రాకింగ్, అడ్మినిస్ట్రేటివ్ మానిటరింగ్ యాక్టివిటీస్, భారతదేశంలో కొనసాగుతున్న పరిశోధనా రంగాలపై వివరాలు అందజేయడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా కల్పిస్తారు. ఈ వ్యవస్థ ప్రొఫైల్ మేనేజ్మెంట్ టూల్స్ ఫర్ రీసెర్చ్, ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఓ ప్రకటనలో.. "శోధ్ చక్ర చొరవ పరిశోధకులకు ప్రొఫైల్‌లను రూపొందించడానికి, వారి ప్రాధాన్యతలను నిర్వహించడానికి సహాయపడుతుంది" అని తెలిపింది. అధికారిక వెబ్సైట్ ద్వారా లాగిన్ చేయడం ద్వారా పరిశోధకుడు శోధ్ చక్ర సౌకర్యాలను ఉపయోగించుకోగలరని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫారమ్‌ను గరిష్టంగా ఉపయోగించుకోవడానికి పరిశోధకులు, పర్యవేక్షకులకు సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కమిషన్ విశ్వవిద్యాలయాలను కోరింది.
శోధ్ చక్ర ప్లాట్‌ఫారమ్‌లో వర్చువల్ లైబ్రరీ, డేటా స్టోరేజ్, స్కాలర్ల కోసం వనరులు, అడ్మినిస్ట్రేటివ్ మానిటరింగ్, పరిశోధన పనుల పురోగతిని తెలుసుకోవడానికి విశ్వవిద్యాలయాల కోసం డాష్‌బోర్డ్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్ వినియోగంపై త్వరలో పలు వర్క్‌షాప్‌లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నిర్వహించనుంది. దీనిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకుంటారని, అందుబాటులో ఉన్న వనరుల నుండి ప్రయోజనం పొందుతారని మేము ఆశిస్తున్నాము’ అన్నారు. ప్లాట్‌ఫారమ్‌లో 3.5 లక్షల పూర్తి-టెక్స్ట్ థీసిస్, Google స్కాలర్ నుంచి మిలియన్ల కొద్దీ కథనాలు, ఓపెన్-యాక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లు, Crossref, IRINS ఉన్నాయని తెలిపారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.