హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC: యూనివర్సిటీలకు యూజీసీ షాక్ .. కోవిడ్ సమయంలో ఆ ఫీజులన్నీ రీఫండ్.. చదివితే ఎగిరి గంతేస్తారు !

UGC: యూనివర్సిటీలకు యూజీసీ షాక్ .. కోవిడ్ సమయంలో ఆ ఫీజులన్నీ రీఫండ్.. చదివితే ఎగిరి గంతేస్తారు !

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్-19 సమయంలో వసూలు చేసిన హాస్టల్, మెస్ ఫీజులను వీలైనంత త్వరగా తిరిగి విద్యార్థులకు తిరిగి చెల్లించాలని లేదా ఇతర ఫీజులలో సర్దుబాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అన్ని యూనివర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కోవిడ్(Covid)-19 మహమ్మారి సమయంలో యూనివర్సిటీ(University)ల విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో చాలా వర్సిటీలు, స్టూడెంట్ హాస్టల్స్ మూతబడ్డాయి. అయినప్పటికీ.. హాస్టల్, మెస్ ఫీజులను చాలా సంస్థలు వసూలు చేశాయి. ఇలా వసూలు చేసిన హాస్టల్, మెస్ ఫీజులను వీలైనంత త్వరగా తిరిగి విద్యార్థులకు తిరిగి చెల్లించాలని లేదా ఇతర ఫీజులలో సర్దుబాటు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అన్ని యూనివర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. ఈ సూచనలను పాటించని ఉన్నత విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది.

మహమ్మారి సమయంలో యూనివర్సిటీలు వసూలు చేస్తున్న హాస్టల్, మెస్ ఫీజులపై విద్యార్థులు గతంలో UGCకి ఫిర్యాదు చేశారు. సేవలు అందుబాటులో లేకపోయినా ఫీజు(Fee)లు వసూలు చేసి, వాపసు చేయలేదు. ఈ మేరకు మంగళవారం యూజీసీ సెక్రటరీ ప్రొఫెసర్ రజనీష్ జైన్ అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లకు లేఖ రాశారు.

‘COVID-I9 మహమ్మారి కాలంలో హాస్టల్, మెస్ సేవలను ఉపయోగించలేదని విద్యార్థుల నుంచి అనేక సూచనలు అందాయి. అయినప్పటికీ సంస్థలు ఇప్పటికే చెల్లించిన మెస్ ఛార్జీలు, హాస్టల్ ఫీజులను సర్దుబాటు చేయడం/వాపసు చేయడం లేదు. COVID-I9 మహమ్మారి కాలంలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన మెస్ ఛార్జీలు, హాస్టల్ ఫీజులను సర్దుబాటు/క్యారీ ఫార్వార్డ్ చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలను కోరుతున్నాం.’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  Politicians Promises: దేశంలో ఉచిత పథకాల లిస్ట్ ఇదే..! కలర్ టీవీల నుంచి రోబోల వరకూ ఉచితంగా పంచినవే ఇవే..!!



ఏదైనా వర్సిటీ, కాలేజ్‌లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న విద్యార్థుల మొత్తం ఫీజును తిరిగి చెల్లించాలని యూజీసీ అన్ని యూనివర్సిటీలను కోరింది. JEE మెయిన్, NEET, CUET ఫలితాలు ఇంకా రానందున, ఈ సంవత్సరం అడ్మిషన్ ప్రక్రియ అక్టోబర్ వరకు కొనసాగవచ్చు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు బ్యాకప్ ఆప్షన్‌గా ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నారు. విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే అక్టోబర్ 31లోగా పూర్తి ఫీజు రీఫండ్ చేయాలని యూజీసీ వివిధ కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 31 వరకు అడ్మిషన్ క్యాన్సిలేషన్ లేదా మైగ్రేషన్‌కు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. డిసెంబరులోగా చేస్తే ఈ ప్రక్రియకు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1,000 మించకూడదు. అనేక వర్సిటీలు ఆగస్టు, సెప్టెంబరు మధ్యలో తమ అకడమిక్ సెషన్‌ను ప్రారంభిస్తాయి. తరగతులు ప్రారంభమైన ఒక నెల తర్వాత రుసుమును సాధారణంగా తిరిగి చెల్లించరు. అయితే ఈసారి నిబంధనను మార్చారు.

First published:

Tags: Covid -19 pandemic, Hostel students, Students, UGC, University