Home /News /jobs /

UGC SCHOLARSHIP SCHEMES FOR SINGLE GIRL STUDENTS RANK HOLDERS AND MORE GH VB

Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) నాలుగు కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్​లతో ముందుకు వచ్చింది. ర్యాంక్ హోల్డర్లు, సింగిల్ గర్ల్​ చైల్డ్​, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST) విద్యార్థుల కోసం ఈ స్కాలర్​షిప్​లను ఆఫర్​ చేస్తోంది.

ఇంకా చదవండి ...
ప్రతిభ ఉన్నా సరే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక చాలా మంది మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(State Government) స్కాలర్​షిప్​లను (Scholarships) అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC) నాలుగు కొత్త స్కాలర్‌షిప్ స్కీమ్​లతో ముందుకు వచ్చింది. ర్యాంక్ హోల్డర్లు(Rank Holders), సింగిల్ గర్ల్​ చైల్డ్​, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగ (ST) విద్యార్థుల కోసం ఈ స్కాలర్​షిప్​లను ఆఫర్(Offer)​ చేస్తోంది. వీటిలో మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు అయితే నాల్గవది అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్​షిప్​. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో సమర్పించాలి. ఈ స్కాలర్​షిప్​ల అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.

Free Online Course: నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. నాలుగు వారాలు ఆ కోర్సు నేర్చుకుంటే.. జాబ్ పక్కా..!


పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్​ ఫర్​ సింగిల్ గర్ల్..
బాలికలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించేందుకు యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో రెగ్యులర్, ఫుల్​ టైమ్ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దూరవిద్య విధానంలో పీజీ కోర్సుల్లో చేరే వారికి ఈ స్కాలర్​షిప్​ వర్తించదు.

కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉన్న వారికే ఈ స్కాలర్​షిప్​ వర్తిస్తుంది. ఏడాది మొత్తం 1,200 స్కాలర్​షిప్​లను అందజేస్తారు. అర్హులైన వారికి ఏటా రూ. 36,200 స్కాలర్​షిప్​ అందజేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించరాదు.

ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్..
భారతదేశంలోని ఈశాన్య ప్రాంతం (NER) విద్యార్థులను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. మొదటి సంవత్సరంలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్​కు అర్హులు. మెడికల్, పారామెడికల్ కోర్సులతో సహా సాధారణ డిగ్రీ కోర్సులు చేసే విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షలకు మించకూడదు. ఏటా 10,000 మంది విద్యార్థులకు స్కాలర్​షిప్​ అందజేస్తారు. సాధారణ డిగ్రీ చేసే వారికి నెలకు రూ. 5,400, టెక్నికల్, మెడికల్, ప్రొఫెషనల్, పారామెడికల్ కోర్సులు చేసే వారికి నెలకు రూ.7,800 స్కాలర్​షిప్​ అందజేస్తారు.

IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..


యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్లకు స్కాలర్‌షిప్..
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో యూనివర్సిటీ టాపర్స్​గా నిలిచిన వారికి యూజీసీ ఈ స్కాలర్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. అయితే, ప్రొఫెషనల్, దూరవిద్య కోర్సులు చేసే వారికి ఈ స్కాలర్​షిప్​ వర్తించదు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, అటానమస్ కాలేజీలో రెగ్యులర్, ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ పొందిన మొదటి, రెండవ ర్యాంక్ హోల్డర్లు మాత్రమే ఈ స్కాలర్‌షిప్​కు అర్హులు.

ఏటా సాధారణ కోర్సులు చేసే 1,800 మంది, ఆనర్స్ కోర్సులు చేసే 575 మందికి స్కాలర్​షిప్​ అందజేస్తారు. స్కాలర్‌షిప్ కింద రెండేళ్లపాటు నెలకు రూ. 2,000 అందజేస్తారు. అభ్యర్థుల వయస్సు అడ్మిషన్ సమయంలో 30 సంవత్సరాలలోపు ఉండాలి.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్​సీ, ఎస్​టీ స్కాలర్‌షిప్ స్కీమ్​..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ వైపు ప్రోత్సహించేందుకు ఈ స్కాలర్​షిప్​ స్కీమ్​ను ప్రవేశపెట్టారు. దీని కింద ఏటా 1,000 మందికి స్కాలర్​షిప్​ అందజేస్తారు. ఎంఈ, ఎంటెక్ కోర్సులకు నెలకు రూ.7,800, ఇతర కోర్సులకు నెలకు రూ.4,500 స్కాలర్​షిప్​ మంజూరు చేస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు