హోమ్ /వార్తలు /jobs /

UGC Scholarships: పీజీ విద్యార్థులకు యూజీసీ అందిస్తున్న వివిధ స్కాలర్‌షిప్‌‌లు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే!

UGC Scholarships: పీజీ విద్యార్థులకు యూజీసీ అందిస్తున్న వివిధ స్కాలర్‌షిప్‌‌లు.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ వివరాలివే!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కళాశాలలు, విశ్వవిద్యాలయాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్‌‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది.

    కళాశాలలు, విశ్వవిద్యాలయాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్‌‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ). ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. ఈశాన్య ప్రాంత విద్యార్థులకు ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్‌షిప్‌ (యూజీసీ ఇషాన్ ఉదయ్ లేదా యూజీసీ ఎన్ఈఆర్), ఒంటరి బాలికలకు పీజీ ఇందిరా గాంధీ ఉపకార వేతనం(యూజీసీ సింగిల్ గర్ల్ ఛైల్డ్ స్కాలర్‌షిప్), విశ్వవిద్యాలయాల ర్యాంక్ హోల్డర్ల కోసం పీజీ స్కాలర్‌షిప్‌, ప్రొఫెషనల్ కోర్సులను చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ స్కాలర్‌షిప్‌ లాంటి ఉపకార వేతన పథకాలను యూజీసీ అమలు చేస్తోంది. జాతీయ స్కాలర్‌షిప్‌(NSP) పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్ సైట్ ద్వారా అర్హత గల విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాల్సిందిగా యూజీసీ కోరింది. ఈ ఉపకార వేతనాలకు సంబంధించిన అర్హత, స్కాలర్‌షిప్‌ మొత్తం తదితర వివరాలు చూద్దాం.

    యూజీసీ ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్‌..

    ఈ స్కాలర్‌షిప్‌ను ప్రత్యేకంచి దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ప్రారంభించారు. 2014-15 విద్యాసంవత్సరం నుంచి స్కాలర్‌షిప్‌‌ అందిస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ స్కాలర్‌షిప్‌ పోర్టల్ లో దరఖాస్తులు ఓపెన్ అయ్యాయి. ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్‌ ద్వారా ఈశాన్య ప్రాంత విద్యార్థులకు ఉన్నత అవకాశాలు కల్పించడం, స్థూల నమోదు నిష్పత్తి(GER) పెంచడంపై యూజీసీ దృష్టిసారిస్తోంది. ఈ పథకం కింద 10 వేల మందికి ఉపకార వేతనాలు అందిస్తారు. జనరల్ డిగ్రీ కోర్సుల వారికి నెలకు రూ.5,400, టెక్నికల్, ప్రొఫెషనల్, పారామెడికల్ కోర్సులు చదివేవారికి రూ.7,800 అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ నవంబరు 30.

    ఒంటరి బాలికల కోసం పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్‌..

    పీజీ కోర్సులు చదివే ఒంటరి ఆడపిల్లల చదువులకు ఈ స్కాలర్‌షిప్ ఆర్థిక భరోసా కల్పిస్తుంది. కుటుంబంలో ఒక్కరే కుమార్తెగా ఉన్న విద్యార్థినులు, కవల కుమార్తెలు ఈ ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా 3 వేల మందికి స్కాలర్‌షిప్‌‌ అందజేస్తారు. పీజీ పూర్తయ్యే రెండేళ్లలోపు ఏడాదికి రూ.36,200 చెల్లిస్తారు. నవంబరు 30లోపు అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు.

    యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ స్కాలర్‌షిప్‌..

    అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారితో పాటు పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఉపకార వేతనాన్ని యూజీసీ ప్రవేశ పెట్టింది. వృత్తివిద్య, దూరవిద్య ద్వారా చదువుకునే విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి రారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్ కళాశాలలు లేదా పీజీ కాలేజ్ రెగ్యులర్ లాంటి వాటిలో ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన వారు ఈ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రెండేళ్ల పాటు నెలకు రూ.3,100 చెల్లిస్తారు. దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబరు 30.

    పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌ స్కీమ్..

    ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక భరోసానిచ్చేందుకు యూజీసీ ఈ పథకం ప్రవేశపెట్టింది. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చదువుకుంటున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాలేరు. వీటిని నాన్ ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణిస్తారు. ఎంఈ, ఎంటెక్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.7,800 చెల్లిస్తారు. మొత్తం 1000 స్కాలర్‌షిప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ నవంబరు 30.

    First published:

    Tags: UGC

    ఉత్తమ కథలు