Home /News /jobs /

UGC Scholarship: విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

UGC Scholarship: విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా

UGC Scholarship: విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

UGC Scholarship: విద్యార్థులకు నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

UGC Scholarship 2021 | స్కాలర్‌షిప్ పొందాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC మొత్తం 1000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    విద్యార్థులకు శుభవార్త. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందించనుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు యూజీసీ స్కాలర్‌షిప్స్ లభిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్-ME, మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ-MTech కోర్సులు చదివే వారికి నెలకు రూ.7,800, ఇతర పీజీ కోర్సులు చదివేవారికి నెలకు రూ.4,500 స్కాలర్‌షిప్ లభిస్తుంది. కోర్సులో చేరిననాటి నుంచి ఈ స్కాలర్‌షిప్స్ వర్తిస్తాయి. అయితే ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసేముందు విద్యార్థులు కొన్ని నియమనిబంధనల్ని గుర్తుంచుకోవాలి.

    ECIL Recruitment 2021: హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    RRB Group D Jobs: త్వరలో 1,03,769 రైల్వే ఉద్యోగాలకు పరీక్ష... సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి

    ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లాంటి కోర్సుల్ని నాన్ ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ కోర్సులు చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందేందుకు అర్హులు కాదు. ఇక కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివేవారికి కూడా ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ వర్తించదు. రెండేళ్లు లేదా మూడేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. ఎంపికైన విద్యార్థుల అకౌంట్‌లోకి నేరుగా స్కాలర్‌షిప్ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది యూజీసీ. విద్యార్థులు తర్వాతి తరగతికి ప్రమోట్ కాకపోతే స్కాలర్‌షిప్ ఆగిపోతుంది.

    IAF Recruitment 2021: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 282 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెన్షన్ భారీగా పెంపు

    ఆసక్తిగల విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్స్‌కు అప్లై చేయడానికి 2021 నవంబర్ 30 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌ను విద్యార్థి చదువుతున్న ఇన్‌స్టిట్యూట్ వెరిఫై చేయడం తప్పనిసరి. వెరిఫికేషన్ విండో 2021 డిసెంబర్ 15 వరకు తెరిచే ఉంటుంది. మరి ఈ స్కాలర్‌షిప్స్‌కు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    అభ్యర్థులు ముందుగా https://scholarships.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో UGC / AICTE Schemes సెలెక్ట్ చేయాలి.
    అందులో PG SCHOLARSHIP SCHEME FOR SC ST STUDENTS FOR PERSUING PROFESSIONAL COURSES లింక్ క్లిక్ చేయాలి.
    వివరాలన్నీ చదివిన తర్వాత ఇదే వెబ్‌సైట్‌లో New Registration పైన క్లిక్ చేయాలి.
    పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
    ఆ తర్వాత స్కాలర్‌షిప్ స్కీమ్ సెలెక్ట్ చేసి అప్లై చేయాలి.
    దరఖాస్తు చేసేముందు విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, బోనఫైడ్, బ్యాంక్ పాస్‌బుక్ లాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Scholarship, Scholarships, UGC, University Grants Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు