Home /News /jobs /

Scholarship: విద్యార్థులకు అలర్ట్... రూ.7,800 స్కాలర్‌షిప్ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Scholarship: విద్యార్థులకు అలర్ట్... రూ.7,800 స్కాలర్‌షిప్ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Scholarship: విద్యార్థులకు అలర్ట్... రూ.7,800 స్కాలర్‌షిప్ దరఖాస్తుకు రేపే చివరి తేదీ
(ప్రతీకాత్మక చిత్రం)

Scholarship: విద్యార్థులకు అలర్ట్... రూ.7,800 స్కాలర్‌షిప్ దరఖాస్తుకు రేపే చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)

UGC Scholarship Scheme | స్కాలర్‌షిప్ కోరుకునే విద్యార్థులకు శుభవార్త. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నెలకు రూ.7,800 వరకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేకపోతున్న విద్యార్థులకు శుభవార్త. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ (Scholarship) అందించేందుకు వేర్వేరు స్కీమ్స్ అందిస్తోంది. అందులో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ స్కీమ్ ప్రకటించింది. ఎంపికైన వారికి నెలకు రూ.7,800 వరకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ప్రొఫెషనల్ కోర్సులు చదువాలనుకుంటున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేయాలి. కోర్సులో చేరిననాటి నుంచి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతీ నెలా రూ.7,800 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 30 చివరి తేదీ.

    IBPS Recruitment 2021: ఐబీపీఎస్‌లో ఉద్యోగాలు... రూ.1,66,000 వరకు వేతనం

    UGC Scholarship Scheme: స్కాలర్‌షిప్ స్కీమ్ వివరాలివే


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 30

    వెరిఫికేషన్‌కు చివరి తేదీ- 2021 డిసెంబర్ 15

    స్కాలర్‌షిప్స్ సంఖ్య- రూ.1000

    స్కాలర్‌షిప్- మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్-ME, మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ-MTech కోర్సులు చదివే వారికి నెలకు రూ.7,800, ఇతర పీజీ కోర్సులు చదివేవారికి నెలకు రూ.4,500

    విద్యార్హతలు- టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు అప్లై చేయొచ్చు. రెండేళ్లు లేదా మూడేళ్ల పీజీ కోర్స్

    ఎవరు అర్హులు కాదు- ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం కోర్సులు చదివేవారు అర్హులు కాదు. కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదివేవారికీ ఈ స్కాలర్‌షిప్ లభించదు.

    ఇతర నిబంధనలు- విద్యార్థులకు ప్రతీ నెలాఅకౌంట్‌లోకి స్కాలర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. విద్యార్థులు తర్వాతి తరగతికి ప్రమోట్ అయితేనే స్కాలర్‌షిప్ కొనసాగుతుంది.

    ఈ స్కాలర్‌షిప్ గైడ్‌లైన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    SBI SO Recruitment 2021: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 ఉద్యోగాలు... రూ.2,00,000 వరకు వేతనం

    UGC Scholarship Scheme: అప్లై చేయండి ఇలా


    Step 1- విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ ఓపెన్ చేయాలి.

    Step 2- New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 3- పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 4- ఆ తర్వాత స్కాలర్‌షిప్ స్కీమ్ సెలెక్ట్ చేసి అప్లై చేయాలి.

    Step 5- దరఖాస్తు చేసేముందు విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, బోనఫైడ్, బ్యాంక్ పాస్‌బుక్ లాంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.

    Step 6- అప్లై చేసిన తర్వాత దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Scholarship, Scholarships, UGC, University Grants Commission

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు