UGC NET 2021: యూజీసీ నెట్​ క్వాలిఫైడ్​ అభ్యర్థులకు ఊరట.. NTA కీలక నిర్ణయం.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

యూజీసీ నెట్​ క్వాలిఫై అయినా సరే కరోనా కారణంగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయలేని​ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

  • Share this:
యూజీసీ నెట్​ క్వాలిఫై అయినా సరే కరోనా కారణంగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయలేని​ అభ్యర్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). 2018 డిసెంబర్ లేదా 2019 జూన్ సెషన్లకు సంబంధించిన యూజీసీ నెట్ పరీక్షలో JRF లేదా UGC NET అర్హత సాధించినప్పటికీ, కరోనా కారణంగా మాస్టర్స్ డిగ్రీ కోర్సు పూర్తి చేయని అభ్యర్థులకు ఎక్స్​టెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఎక్స్​టెన్షన్​ ప్రకారం, 2018 డిసెంబర్ సెషన్ యూజీసీ నెట్​ & జాయింట్​ సీఎస్​ఐఆర్​ యూజీసీ టెస్ట్​ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాస్టర్స్​ పూర్తి చేసేందుకు 2022 జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. ఇక 2019 జూన్ సెషన్​లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాస్టర్స్​ పూర్తి చేసేందుకు 2022 డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది.  2018, 2019లో నిర్వహించిన నెట్​ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు కరోనా కారణంగా వారి మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ లేదా పీజీ కోర్సును పూర్తి చేయలేకపోయారు. అటువంటి వారికి ఈ వ్యాలిడిటీ ఎక్స్​టెన్షన్​ నిర్ణయం ఊరటనిచ్చేదని చెప్పవచ్చు.
TS EAMCET 2021: తెలంగాణలో ఎల్లుండే ఎంసెట్ ఎగ్జామ్.. విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివే..

కాగా, యూజీసీ నెట్​ పరీక్షను ఏటా జూన్​, డిసెంబర్​ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2020 డిసెంబర్ సెషన్​ వాయిదా పడింది. ఈ పరీక్షను 2021 మే 2 నుంచి మే 17 మధ్య నిర్వహించారు. మరోవైపు యూజీసీ నెట్​ 2021 జూన్​ సెషన్​ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అతి త్వరలోనే దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షకు సంబంధించిన అప్​డేట్స్​ కోసం www.here-ugcnet.nta.nic.in ను సందర్శించాలని ఎన్​టీఏ కోరింది.

త్వరలోనే యూజీసీ నెట్–2021 జూన్​ సెషన్​ షెడ్యూల్​..
యూజీసీ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, జేఆర్​ఎఫ్​ పోస్టులకు అర్హత సాధిస్తే, వారికి తాత్కలికంగా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే నిర్ణీత గడువులోగా వారు మాస్టర్స్​ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రాబోయే జూన్​ సెషన్​ యూజీసీ నెట్​ పరీక్షకు ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థులు లేదా పరీక్షలు అయిపోయి, ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులు హాజరు కావచ్చు. కరోనా కారణంగా అభ్యర్థుల ఇబ్బందులను గుర్తించుకొని సీఎస్​ఐఆర్​ నెట్​, యూజీసీ నెట్​ ఎక్స్​టెన్షన్​ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published: