విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసే రిసెర్చ్ స్కాలర్లకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(UGC) మార్గదర్శకాలను విడుదల చేసింది. అకాడెమిక్ రీసెర్చ్ ప్రాక్టీసెస్ పేరుతో రూపొందించిన వివరాలను వెల్లడించింది. వీటిలో మంచి అంశాలతో పాటు, సవాళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్లారివేట్ వెబ్ సైన్స్ సంస్థతో కలిసి యూజీసీ ఈ నియమాలను రూపొందించింది. ఈ సంస్థ పరిశోధనలు, వాటి ప్రచురణపై అధ్యయనం చేస్తుంది. ఇప్పటి వరకు 34,000 కంటే ఎక్కువ జర్నల్లు, పరిశోధనా ప్రత్రాలను క్లారివేట్ వెబ్ సైన్స్ ప్రచురించింది. పరిశోధన చేయడంలో ఉండే వివిధ దశల గురించి మార్గదర్శకాలు ఉన్నాయి. డిజైన్, ప్రణాళిక(ప్లానింగ్), అమలు(ఎగ్జిక్యూషన్), డాక్యుమెంటేషన్, డేటా స్టోరేజ్ వంటి అంశాల గురించి ఇందులో వివరించారు. పరిశోధన చేస్తున్నప్పుడు ఎదురయ్యు దుష్పరిణామాల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు.
RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ దరఖాస్తు రిజెక్ట్ అయిందా? ఏం చేయాలో తెలుసుకోండి
Shipyard Jobs: షిప్‌యార్డ్‌లో 577 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
ప్రస్తుతం రీసెర్చ్ చేసే వారి పరిశోధనా పత్రంలో సమస్యలను ఎలా గుర్తించాలో, ఎలా తనిఖీ చేయాలో వివరించారు. వాటిలో ప్లాగియారిజమ్, ఫాల్సిఫికేషన్, ఫ్యాబ్రికేషన్, డేటా మిస్ ఇంటర్ప్రెటేషన్ వంటివి ఉన్నాయి. ఈ మార్గదర్శకాలు రిసెర్చ్ చేసే వారి పరిశోధనా పత్రాల ప్రచురణకు ఉపయోగపడనున్నాయి. రీసెర్చ్ విభాగంలోకి రావాలనుకునే ఔత్సాహికులకు మార్గదర్శకత్వం చేయడంలో ఇవి సహాయపడతాయి. పరిశోధకులకు ఈ మార్గదర్శకాలు ఉపయోగపడతాయని యూజీసీ వైస్ చైర్మన్ డాక్టర్ భూషణ్ పట్వర్ధన్ చెబుతున్నారు. మారుతున్న కాలంతో పాటు విద్యా సమగ్రతను, పరిశోధన నాణ్యతను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
UPSC Recruitment 2020: మొత్తం 307 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
DRDO Recruitment 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో 90 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
జర్నళ్లు కాపీ కొట్టకుండా పోరాడడంలో డాక్టర్ పట్వర్ధన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. చాలా పబ్లికేషన్లు, జర్నళ్లు రిసెర్చర్లకు డబ్బులు ఇచ్చి తమ పోర్టళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురించమని అడుగుతాయి. కానీ వాటిని ఆ సంస్థలు పూర్తిగా పరిశీలించవు. అవసరమైన ఎడిటింగ్ సేవలను అందించవు. ఇటువంటి జర్నళ్లకు సరైన విద్యా ప్రమాణాలు ఉండవు. అందువల్ల చట్టబద్ధమైన పీర్-రివ్యూడ్ జర్నళ్లతో పోలిస్తే వీటిని సులభంగా గుర్తించవచ్చు. పరిశోధన పద్ధతుల్లో సమగ్రత అవసరాన్ని నొక్కి చెప్పే సంస్కృతికి ఒక పునాదిని సిద్ధం చేసేలా మార్గదర్శకాలను రూపొందించామని డాక్టర్ పట్వర్ధన్ చెబుతున్నారు. వివిధ రంగాలలో పరిశోధన ప్రాజెక్టులకు, రిసెర్చర్లకు యూజీసీ గ్రాంట్లు అందిస్తుంది. మన దేశంలో పరిశోధన రంగంలోకి రావాలనుకునేవారికి యూజీసీ దేశవ్యాప్తంగా జాతీయ ప్రవేశ పరీక్ష (నెట్) నిర్వహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.