హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC: మరో మూడు వర్సిటీల్లో ఆన్‌లైన్, డిస్టెన్స్ కోర్సులు.. ఆ సంస్థలకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..

UGC: మరో మూడు వర్సిటీల్లో ఆన్‌లైన్, డిస్టెన్స్ కోర్సులు.. ఆ సంస్థలకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల చాలా వర్సిటీలు ఆన్‌లైన్, డిస్టెన్స్ కోర్సులను అందించేందుకు యూజీసీ అనుమతి కోరాయి. తాజాగా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో కోర్సులను ఆఫర్ చేయడానికి మూడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

విద్యాసంస్థలు ఏవైనా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలన్నా, కోర్సుల అమలుకు నిబంధనలు తీసుకురావాలన్నా ముందుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఆమోదముద్ర వేయాలి. ఇటీవల చాలా వర్సిటీలు ఆన్‌లైన్(Online), డిస్టెన్స్ కోర్సులను(Distance Course) అందించేందుకు యూజీసీ అనుమతి కోరాయి. తాజాగా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో కోర్సులను ఆఫర్(Offer) చేయడానికి మూడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్‌కు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కమిషన్ అనుమతి ఇచ్చిన ఇన్‌‌స్టిట్యూట్‌లలో శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ -హిమాచల్ ప్రదేశ్, గల్గోటియాస్ యూనివర్సిటీ -ఉత్తరప్రదేశ్, వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ -రాజస్థాన్ ఉన్నాయి. ఈ మూడు ఇన్‌స్టిట్యూట్స్ 2023 అకడమిక్ సెషన్ జనవరి, ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.

CTET Admit Cards: సీటెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. వారి కోసం మరో అవకాశం..

* ఆఫర్ చేస్తున్న కోర్సులు

ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ.. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA), మాస్టర్ ఆఫ్ కామర్స్ వంటి ఐదు కోర్సులను ఓపెన్ అండ్ ODL ఫార్మాట్‌లో తాజాగా ఆఫర్ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్.. ఓపెన్, ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫార్మాట్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) అనే ఒకే ఒక ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.

రాజస్థాన్‌కు చెందిన వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) అనే మూడు ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోంది.

అడ్మిషన్స్ చివరి తేదీ మార్చి 31

యూజీసీ (ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్) నిబంధనలు-2020, స్పెసిఫిక్ ఫీజు వివరాలకు అనుగుణంగా అఫిడవిట్ స్వీకరించి, ధ్రువీకరించిన తరువాత మాత్రమే ఈ ఇన్‌స్టిట్యూట్స్‌‌కు యూజీసీ క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రతి ఎడ్యుకేషన్ సెషన్‌కు అడ్మిషన్ గడువు యూజీసీ నిర్ణయించనుంది. అందుకు అనుగుణంగా హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఇన్‌స్టిట్యూట్స్ పదిహేను రోజుల్లో అడ్మిషన్ వివరాలను అప్‌లోడ్ చేయనున్నాయి.

యూజీసీ నిబంధనల ప్రకారం.. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్ రిక్వైర్మెంట్స్ పాటిస్తున్నంత కాలం ఈ మూడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆన్‌లైన్ కోర్సులను అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మూడు ఇన్‌స్టిట్యూట్ లలో జనవరి-ఫిబ్రవరి 2023 నుంచి ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్‌కు అడ్మిషన్‌కు చివరి తేదీ మార్చి 31గా యూజీసీ నిర్ణయించింది.

First published:

Tags: Career and Courses, JOBS, UGC

ఉత్తమ కథలు