హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

UGC: ఇకపై దేశంలో డిగ్రీలు, పీజీలు ఉండవ్​.. యూజీసీ కొత్త మార్గదర్శకాలు.. వివరాలివే

UGC: ఇకపై దేశంలో డిగ్రీలు, పీజీలు ఉండవ్​.. యూజీసీ కొత్త మార్గదర్శకాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటివరకు ఎడ్యుకేషనల్​ క్వాలిఫికేషన్​ విషయానికొస్తే టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అంటూ సమాధానాలు వచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో అలా చెప్పే వీలు ఉండదు.

ఇప్పటికే దేశంలో కొత్త విద్యా వ్యవస్థ (New educational system)ఆవిష్కృతమైంది. విద్యా రంగంలో కీలక మార్పులు చేస్తూ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. విద్యా రంగంలో మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. ఇపుడు యూజీసీ (UGC) మరో అడుగు ముందుకేసింది.  ఇప్పటివరకు ఎడ్యుకేషనల్​ క్వాలిఫికేషన్​ విషయానికొస్తే టెన్త్‌ (Tenth), ఇంటర్‌ (Inter), డిగ్రీ (Degree), పీజీ (PG), పీజీ డిప్లొమా అంటూ సమాధానాలు వచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో అలా చెప్పే వీలు ఉండదు. లెవల్‌ 4 (Level 4), లెవల్‌ 5 (Level 5).. లెవల్‌ 6 అంటూ చెప్పాల్సి వస్తుంది. వివిధ విద్యార్హతలకు స్థాయిలు (లెవల్స్‌ను) నిర్ణయించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నూతన విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషనల్‌ (National Higher Educational) క్వాలిఫికేషన్‌ ప్రేమ్‌వర్క్‌ ముసాయిదాను విడుదల చేసింది.

40 క్రెడిట్స్‌ సాధిస్తే సర్టిఫికెట్‌..

సాంకేతిక విద్య (Technical education), జనరల్‌ కోర్సులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు విడివిడిగా లెవల్స్‌ నిర్ధారించనున్నట్టు యూజీసీ తెలిపింది. దీంతో ఏ విద్యార్థి అయినా విదేశాలకు వెళ్లినప్పుడు ఏ లెవల్‌ (Level) పూర్తిచేసిందీ చెప్తే సరిపోతుంది. ఈ ముసాయిదా (Framework)పై యూజీసీ రాష్ట్రాల అభిప్రాయాలను సైతం కోరింది. క్రెడిట్స్‌ (Credits)ను సైతం యూజీసీ ఖరారు చేసింది. 40 క్రెడిట్స్‌ సాధిస్తే సర్టిఫికెట్‌, 80 క్రెడిట్స్‌ సాధిస్తే డిప్లొమా, 120 క్రెడిట్స్‌ సాధిస్తే డిగ్రీని జారీచేయవచ్చని పేర్కొన్నది. విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు యూజీసీ ఈ ప్రేమ్‌వర్క్‌ రూపొందించి, ఉన్నత విద్యను ఏడు స్థాయిలుగా యూజీసీ వర్గీకరించింది. గతంలో ఆరు స్థాయిలు ఉండగా, తాజాగా ఏడు స్థాయిలకు పెంచారు. గతంలో ఇప్పుడు సాధించాల్సిన క్రెడిట్స్‌ సంఖ్యలో మార్పులు చేయలేదు.

కేటగిరీలు ఎలా ఉండనున్నాయి..?

ఉదాహరణకు.. డిగ్రీ (UG) మెదటి సంవత్సరం రెండు సెమిస్టర్లు చదివితే.. 40 క్రెడిట్​ పాయింట్లు కేటాయిస్తారు, వారిని లెవల్​ 4.5 కేటగిరీలో చేరుస్తారు. అలాగే డిగ్రీ రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు) చదివితే వారికి 80 క్రెడిట్​ పాయింట్లు కేటాయించి... లెవల్​ 5 కేటగిరీలో చేరుస్తారు. ఇక డిగ్రీ మూడు సంవత్సరాలు చదివితే( మొత్తం ఆరు సెమిస్టర్లు) 120 క్రెడిట్​ పాయింట్లు కేటాయించి, లెవల్​ 5.5 కేటగిరీలో చేరుస్తారు. ఇలాగే డిగ్రీ వొకేషన్​ మూడేళ్లకు లెవల్​ 5.5 కేటగిరీ.. డిగ్రీ నాలుగేళ్లు ఉంటే లేదా పీజీ డిప్లొమోకు 160 క్రెడిట్​ పాయింట్లు ఇచ్చి లెవల్​ 6 కేటగిరీగా పరిగణిస్తారు. అలాగే మాస్టర్స్​ డిగ్రీ 6.5, ఎంటెక్​ కోర్సు లెవల్​ 7, డాక్టోరల్​ డిగ్రీలకు లెవల్​ 8గా పరిగణిస్తారు.

10+2 విధానానికి బదులు 5+3+3+4..

రెండేళ్ల కిందటే నూతన విద్యా విధానం (New education Policy) తీసుకొస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ కొత్త విద్యావిధానంలో విద్యను సరళతరంగా మార్చారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తూ.. విద్యార్థులు తమకిష్టమైన కోర్సులను చదువుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులపై భారం తగ్గించేందుకు సిలబస్‌లో కోతపెట్టారు. ప్రస్తుతమున్న 10+2 విధానానికి బదులు 5+3+3+4 విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో 3 నుంచి 8 ఏళ్ల వరకు పిల్లలకు ఫౌండేషన్ స్టేజీ, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్, 11 నుంచి 14 ఏళ్ల వారు మిడిల్ స్కూల్, 14 నుంచి 18 ఏళ్ల వారు సెకండరీ స్థాయిలో ఉంటారు.

కొత్త జాతీయ విద్యా విధానం మేరకు విద్యార్థులకు ఐదో తరగతి వరకు మాతృ భాషలో బోధన సాగించాలి. విద్యార్థులపై భారం తగ్గించేలా బోర్డు పరీక్షల ప్రాధాన్యతను తగ్గించనున్నారు. ఆరో తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులు ఎంచుకునేందుకు వీలుకల్పిస్తారు.

నాలుగేళ్ల డిగ్రీ కోర్టు తర్వాత ఎం.ఫిల్ చేయకుండానే నేరుగా పీహెచ్‌డీలోకి ప్రవేశం కల్పిస్తారు. రెండేళ్ల తర్వాత డిగ్రీ మానేసిన వారికి డిప్లోమా ఇస్తారు. మధ్యలో చదువు మానేసినా మళ్లీ కొనసాగించుకునే అవకాశం కల్పిస్తారు. సైన్స్, గణితంలో విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే వారిని ప్రోత్సహిస్తారు. 6వ తరగతి నుంచి విద్యార్థులకు కోడింగ్, వృత్తి విద్యా కోర్టులను ప్రారంభిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రకమైన నిబంధనలు ఉంటాయి.

First published:

Tags: Coursers, Degree students, EDUCATION, Tenth class, UGC

ఉత్తమ కథలు