Home /News /jobs /

UGC NET SECOND PHASE EXAMS NEW SCHEDULE RELEASED AS EVER UMG GH

UGC NET: యూజీసీ నెట్ సెకండ్ ఫేస్ ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ విడుదల .. ఎప్పటి నుంచి అంటే ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ- నెట్ (UGC-NET) డిసెంబర్ 2021, జూన్ 2022 విలీనాల రెండో ఫేజ్‌ పరీక్షలు సెప్టెంబర్ 20-30 మధ్య నిర్వహించనుంది. యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ఆ వివరాలు వెల్లడించారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. యూజీసీ- నెట్ (UGC-NET) డిసెంబర్ 2021, జూన్ 2022 విలీనాల రెండో ఫేజ్‌ పరీక్షలు సెప్టెంబర్ 20-30 మధ్య నిర్వహించనుంది. యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ఆ వివరాలు వెల్లడించారు. అయితే రెండో ఫేజ్ పరీక్షలను ఆగస్టు 12,13, 14 తేదీల్లో నిర్వహించాలని ఇంతకు ముందు నిర్ణయించగా, ఇప్పుడు కొత్త డేట్స్ ప్రకటించారు. ‘యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 విలీనంతో ఫేజ్-2 పరీక్షలు(Exams) సెప్టెంబర్ 20-30 మధ్య జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఇందులో 64 సబ్జెక్టులు ఉంటాయి.’ అని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు.

తెలంగాణ(Telangana), ఏపీ(AP) ప్రభుత్వాలు సొంతంగా 2022 జులై 9న పరీక్షలు నిర్వహించాయి. దీంతో తెలుగు, మరాఠీ సబ్జెక్టు పరీక్షలు వాయిదాపడ్డాయి. సాంకేతిక సమస్యల కారణంగా జులై 9 షిఫ్ట్-1లోని 7 కేంద్రాల్లో 15 సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించలేదు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఎగ్జామ్ సెంటర్ సిటీ సెప్టెంబర్ 11న రివీల్ కానుంది. రెండో ఫేజ్ పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్‌లు సెప్టెంబర్ 16న అధికారిక వెబ్‌సైట్స్ ugcnet.nta.nic.in లేదా nta.ac.inలో జారీ కానున్నాయి.

కాగా, యూజీసీ-నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 విలీనాలకు సంబంధించిన మొదటి ఫేజ్ పరీక్షలు జులై 9-12 వరకు, దేశవ్యాప్తంగా 225 నగరాల్లో 310 సెంటర్లలో జరిగాయి. మొత్తంగా 33 సబ్జెక్టులపై నెట్ పరీక్ష జరిగింది.

ఇదీ చదవండి: Raksha Bandhan:రక్షా బంధన్‌కి ఇలా ప్లాన్ చేయండి.. మీ సోదరి ఎంత సంతోషిస్తుందో తెలుసా !



మరోవైపు, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ముందుగా అడ్మిషన్ తీసుకుని, ఆఫై రద్దు చేసుకుంటే మొత్తం ఫీజును వాపసు ఇవ్వాలని ఆదేశించింది. సీయూఈటీ యూజీ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇప్పటికే బ్యాకప్ ఆప్షన్‌గా ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకున్నారు. 2022-23 అకడమిక్ సెషన్‌కు సంబంధించిన ఫీజుల పూర్తి వాపసును ప్రత్యేక కేసుగా పరిగణించాలని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ కోరారు. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థలకు లేఖ రాశారు. అక్టోబర్ 31లోపు అడ్మిషన్ రద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఈఏడాది డిసెంబర్‌లోగా రద్దు చేసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు రూ.1000 పైనే ఉండే అవకాశం ఉంది.



యూజీసీ నిర్ణయంతో అక్టోబర్ 31లోపు అడ్మిషన్స్ రద్దు/మైగ్రేషన్ విషయంలో యూనివర్సిటీలు అన్ని ఛార్జీలతో సహా మొత్తం ఫీజును తప్పనిసరిగా వాపసు చేయాల్సి ఉంటుంది. అయితే వివిధ ప్రైవేట్ యూనివర్సిటీల రీఫండ్ విధానం ప్రకారం.. కోర్సులు ప్రారంభించిన ఒక నెల తర్వాత, ఫీజు తిరిగి వాపసు చేయడం ఉండదు. ఈ యూనివర్సిటీలు ఆగస్టు - సెప్టెంబరు మధ్యలో తమ అకడమిక్ సెషన్‌ను ప్రారంభిస్తాయి. మరోపక్క ఫీజు రీఫండ్ పాలసీ ప్రస్తుత అకడమిక్ సెషన్ కోసం అక్టోబర్ 31 వరకు యూజీసీ పొడిగించింది.
Published by:Mahesh
First published:

Tags: Exams, JOBS, National Testing Agency, UGC NET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు