UGC NET RESULTS 2021 DECLARED HOW TO CHECK UGCNET NTA NIC IN GH VB
UGC NET Results: యూజీసీ నెట్ 2021 ఫలితాల విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
యూజీసీ నెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు యూజీసీనెట్ అధికారిక వెబ్సైట్లు www.ugcnet.nta.nic.in లేదా www.nta.nic.in ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
యూజీసీ నెట్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అభ్యర్థులు యూజీసీనెట్ అధికారిక వెబ్సైట్లు www.ugcnet.nta.nic.in లేదా www.nta.nic.in ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా కారణంగా డిసెంబర్ 2020, జూన్ 2021 రెండు సెషన్లను విలీనం ఒకేసారి నిర్వహించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 12.67 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5 తేదీల మధ్య పరీక్ష నిర్వహించారు. UGC NET 2021లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతేకాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. మరోవైపు, పీహెచ్డీ ప్రవేశాలకు సైతం యూజీసీ నెట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
2. హోమ్‌పేజీలో ఉన్న యూజీసీ నెట్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి.
4. వెంటనే మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
5. భవిష్కత్తులో ఉపయోగం కోసం మీ రిజల్ట్ షీట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫైల్‌ను ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.
కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు?
అభ్యర్థులు పరీక్షలను క్లియర్ చేయడానికి కనీస స్కోర్‌ను సాధించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అయితే, రిజర్వుడ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. అభ్యర్థులు ఒక్కో పేపర్‌ను విడిగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 1లో అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 100కి 40 స్కోర్ చేయాల్సి ఉంటుంది.
ఇదే క్రమంలో, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 100కి 35 స్కోర్ చేయాలి. పేపర్ 2లో అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 200కి 70 నుంచి -75 మార్కులు సాధించాలి. OBC, EWS అభ్యర్థులు 65 నుండి 70 మార్కులు సాధించాలి. ఇక, ఎస్సీ అభ్యర్థులు 60 నుండి 65, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55 నుండి 60 మార్కులు తెచ్చుకోవాలి. ఈ కటాఫ్ మార్కులపై యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.