UGC NET EXTENSION OF UGC NET APPLICATION DEADLINE OPPORTUNITY TO APPLY TILL THE END OF THIS MONTH GH VB
UGC NET Application: యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఏ తేదీ వరకు గడువు పెంచారంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
యూజీసీ, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2021, జూన్ 2022 రెండిటికీ సంబంధించి సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. అయితే తాజాగా దరఖాస్తు గడవును పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
యూజీసీ(UGC), నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2021, జూన్ 2022 రెండిటికీ సంబంధించి సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. అయితే తాజాగా దరఖాస్తు గడవును పొడిగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూజీసీ చైర్మన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్లో(Online) యూజీసీ నెట్‌కు(UGC Net) దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజు చెల్లించడానికి మే 30 వరకు అవకాశం ఉంటుంది. ‘యూజీసీ నెట్, డిసెంబర్ 2021, జూన్ 2022 విలీనం చేసి రెండిటికి ఒకే నోటిఫికేషన్ విడుదల చేశాం. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు దరఖాస్తు(Application), ఫీజు(Fee) చెల్లింపు గడువును మే 30, 2022 వరకు పొడిగించాం.’ అని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ట్విట్టర్లో(Twitter) పేర్కొన్నారు.
* UGC NET దరఖాస్తు విధానం
స్టెప్-1: అధికారిక వెబ్సైట్ ntanet.nic.in ను సందర్శించాలి.
స్టెప్-2: UGC NET డిసెంబర్ 2021/జూన్ 2022 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్-3: కొత్త పేజీ మీ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది.
స్టెప్.-4: రిజిస్ట్రేషన్ కోసం వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి
స్టెప్-5: కొత్తగా క్రియేట్ చేసిన నంబర్ సహాయంతో లాగిన్ అవ్వండి
స్టెప్-6: అప్లికేషన్ పూరించి, మీ ఫొటోను అప్ లోడ్ చేయండి.
స్టెప్-7: ఇప్పుడు ఫీజు చెల్లించండి.
స్టెప్-8: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోండి
* UGC నెట్- 2022 ఫీజు వివరాలు
యూజీసీ నెట్ 2021 డిసెంబర్, 2022 జూన్ రెండిటికి సంయుక్తంగా పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తున్నందున దరఖాస్తు రుసుమును పెంచింది. 10 శాతం పెంపుతో జనరల్ కేటగిరీ లేదా అన్ రిజర్వడ్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది రూ.1,000 మాత్రమే రుసుము ఉండేది.
ఇక EWS, OBC-NCL కెటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 50 పెంపుతో రూ550 చెల్లించాల్సి ఉంది. చివరగా, SC, ST, PwD, ట్రాన్స్ జెండర్ల దరఖాస్తు రుసుమును రూ. 25 పెంచారు. దీంతో ఇది ఇప్పుడు రూ.275కు చేరింది.
* సబ్జెక్ట్‌ల పెంపు
యూజీసీ నెట్ పరీక్షను ఇప్పటివరకు 81 సబ్జెక్టుల్లో నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం మరో సబ్జెక్టును జోడించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC). సమాచార బులెటిన్ ప్రకారం.. UGC సబ్జెక్టు జాబితాకు 'హిందూ అధ్యయనాలు' (సబ్జెక్ట్ కోడ్ 102) అనే కొత్త సబ్జెక్ట్ ను జోడించింది. దీంతో UGC NET దరఖాస్తు ఫారమ్ పూరించేటప్పుడు అభ్యర్థులు ఇప్పుడు 82 విభాగాల జాబితా నుండి ఎంచుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారమ్‌లో తప్పులను సవరించడానికి ఎన్టీఏ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. మే 23, 2022 రాత్రి 9 గంటల వరకు అందుకు గడువు ఉన్నట్లు తెలిపింది. కాగా, UGC NET సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. అయితే కోవిడ్-19 కారణంగా 2021 డిసెంబర్లో జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. దీంతో రెండు టర్మ్‌లను మరింత స్థిరంగా చేయడం కోసం డిసెంబర్ 2021, జూన్ 2022 టర్మ్‌లను విలీనం చేస్తూ సంయుక్తంగా నోటిఫికేషన్‌ను ఏన్టీఏ విడుదల చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.