Home /News /jobs /

UGC NET 2021: నెలకు రూ.25,000 పారితోషికం కావాలా? ఈ పరీక్ష రాయండి

UGC NET 2021: నెలకు రూ.25,000 పారితోషికం కావాలా? ఈ పరీక్ష రాయండి

UGC NET 2021: నెలకు రూ.25,000 పారితోషికం కావాలా? ఈ పరీక్ష రాయండి
(ప్రతీకాత్మక చిత్రం)

UGC NET 2021: నెలకు రూ.25,000 పారితోషికం కావాలా? ఈ పరీక్ష రాయండి (ప్రతీకాత్మక చిత్రం)

UGC NET 2021 | పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు, పీజీ చదువుతున్నవారు నెలకు రూ.25,000 పారితోషికం పొందడానికి ఇది ఓ మంచి అవకాశం. యూజీసీ నెట్ పరీక్షకు (UGC NET Exam) అప్లై చేయడానికి మరో మూడు రోజులే అవకాశం ఉంది.

    మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారా? పీజీ చివరి సంవత్సరం చదువుతున్నారా? అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (National Eligibility Test) రాయండి. ఈ పరీక్ష రాసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (Junior Research Fellowship) అర్హత సాధిస్తే నెలకు రూ.25,000 పారితోషికం పొందొచ్చు. ప్రతీ ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA రెండుసార్లు యూజీసీ నెట్ (UGC NET) ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటుంది. డిసెంబర్, జూన్ సెషన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 డిసెంబర్ సెషన్ షెడ్యూల్ ప్రకారం జరగలేదు. 2020 డిసెంబర్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తైనా ఇంకా పరీక్ష నిర్వహించలేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

    గతేడాది డిసెంబర్ సెషన్‌తో పాటు జూన్ సెషన్ పరీక్ష పరీక్ష కూడా జరగాల్సి ఉంది. దీంతో 2020 డిసెంబర్ సెషన్, 2021 జూన్ సెషన్ పరీక్షల్ని వేర్వేరుగా కాకుండా ఒకేసారి నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. 2020 డిసెంబర్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది కాబట్టి 2021 జూన్ సెషన్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 సెప్టెంబర్ 5 వరకు అప్లై చేయొచ్చు. యూజీసీ నెట్ 2020 డిసెంబర్ సెషన్‌కు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, దరఖాస్తు సబ్మిట్ చేయని అభ్యర్థులు ఇప్పుడు అప్లై చేయొచ్చు. రెండు పరీక్షలు 2021 అక్టోబర్ 6 నుంచి ఒకేసారి జరగనున్నాయి.

    UPSC ESIC Recruitment 2021: రూ.1,70,000 వేతనంతో ఈఎస్ఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    UGC NET 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 10

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 5 రాత్రి 11.50 గంటలు

    దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 6 రాత్రి 11.50 గంటలు

    దరఖాస్తులు సరిదిద్దుకోవడానికి అవకాశం- 2021 సెప్టెంబర్ 7 నుంచి 12

    అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- తేదీ త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA

    పరీక్ష తేదీ- 2021 అక్టోబర్ 6 నుంచి 11

    ఫస్ట్ షిఫ్ట్- ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు

    సెకండ్ షిఫ్ట్- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు

    Income Tax Jobs 2021: రూ.1,42,000 వేతనంతో ఆదాయపు పన్ను శాఖలో జాబ్స్... పరీక్ష లేకుండా ఉద్యోగం

    UGC NET 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- ఏదైనా సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.

    దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.

    వయస్సు- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం 2021 అక్టోబర్ 1 నాటికి 31 ఏళ్లు దాటకూడదు. ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్, మహిళలకు ఐదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఏజ్ లిమిట్ ప్రస్తుత ఎగ్జామ్‌కు మాత్రమే. అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం గరిష్ట వయో పరిమితి లేదు.

    Railway Jobs: భారతీయ రైల్వే ఉద్యోగాలు... రూ.92,300 వరకు వేతనం... అప్లై చేయండిలా

    UGC NET 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- ముందుగా https://ugcnet.nta.nic.in/ వెబ్‌సైట్‌లో హోమ్ పేజీలో Application Form UGC-NET December 2020 and June 2021 cycles క్లిక్ చేయాలి.
    Step 2- అప్లికేషన్ కోసం కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
    Step 3- New Registration పైన క్లిక్ చేయాలి.
    Step 4- ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
    Step 5- Click Here Proceed పైన క్లిక్ చేయాలి.
    Step 6- మీ వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి.
    Step 7- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
    Step 8- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
    Step 9- దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: National Testing Agency, UGC NET

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు