Home /News /jobs /

UGC NET ASPIRANTS ASK EDUCATION MINISTER FOR EXAM DATES HERE IS THE LATEST UPDATES NS GH

UGC NET Exam: 10 నెలల్లో 4 సార్లు వాయిదా పడ్డ యూజీసీ నెట్.. తేదీలపై తాజా అప్ డేట్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2021 జూన్‌లో నిర్వహించాల్సిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను కూడా డిసెంబర్ 2020 పరీక్షలో కలిపేశారు. ఈ రెండు దశల పరీక్షలను నెలలు గడుస్తున్నా నిర్వహించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల అర్హత కోసం ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) మళ్లీ వాయిదా పడింది. ఇంతకుముందు అక్టోబర్ 17 నుంచి 25 తేదీల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ టెస్ట్‌ను మరోసారి వాయిదా వేస్తున్నామని.. తదుపరి నోటీస్ వచ్చే వరకు వేచి చూడాలని ఎన్‌టీఏ వెల్లడించింది. డిసెంబర్ 2020 నుంచి అభ్యర్థులు నెట్ ఫైనల్ ఎగ్జామ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్‌టీఏ మాత్రం గత పది నెలల్లో ఏకంగా నాలుగుసార్లు పరీక్షలను వాయిదా వేసి అభ్యర్థుల్లో తీవ్ర నిరాశకు దారి తీసింది. 2021 జూన్‌లో నిర్వహించాల్సిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్షను కూడా డిసెంబర్ 2020 పరీక్షలో కలిపేశారు. ఈ రెండు దశల పరీక్షలను నెలలు గడుస్తున్నా నిర్వహించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. దాంతో విసిగిపోయిన నెట్ అభ్యర్థులు పరీక్ష తేదీకి సంబంధించి ఫైనల్ డెసిషన్ త్వరగా చెప్పాలని విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్, ఇతర ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్స్ వల్ల యూజీసీ నెట్ పరీక్ష తేదీలను పదే పదే వాయిదా వాయిదా వేసింది పరీక్ష నిర్వహించే సంస్థ ఎన్‌టీఏ. అనేక వాయిదాల తరువాత పరీక్షను చివరిగా అక్టోబర్ 17 నుంచి 25 తేదీల మధ్య నిర్వహిస్తామని తెలిపింది. తీరా పరీక్ష తేదీ సమీపించేసరికి ఎగ్జామ్ మళ్లీ పోస్ట్ పోన్ చేస్తున్నామని.. తదుపరి నోటీసు వచ్చేవరకు వెయిట్ చేయాలని సెలవిచ్చింది. ప్రస్తుతానికైతే ఫైనల్ ఎగ్జామ్ కి సంబంధించిన ఎలాంటి డేట్ ప్రకటించలేదు. అందుకే నెట్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



అభ్యర్థులు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల తుది తేదీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరారు. పరీక్షలకు 10-15 రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్(University Grants Commission)ను కోరారు. పరీక్షల నిర్వహణకు 30 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని.. తద్వారా తమకు సన్నద్ధం కావడానికి సమయం దొరుకుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ అకస్మాత్తుగా పరీక్షను నిర్వహించవద్దని వారు డిమాండ్ చేశారు.



Non Engineering Graduates: నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. మీ కోసం ఏ జాబ్స్ ఎదురుచూస్తున్నాయంటే..

ప్రస్తుతం ట్విట్టర్‌లో #ReleaseNETEXAMDATE అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభ్యర్థులు పరీక్ష తేదీలను ప్రకటించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని మరికొందరు అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిగతా అన్ని పరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు.. యూజీసీ నెట్ ఒకటే ఎందుకు నిర్వహించడం లేదన్న ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నారు అభ్యర్థులు. యూజీసీ నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు యూజీసీకి అనుబంధంగా ఉన్న కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు. కాగా పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఎన్‌టీఏ లేటెస్ట్ నోటీసులో పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Exams, Exams postponed, UGC, UGC NET

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు