యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 డిసెంబర్ పరీక్ష కోసం ఇటీవల రిజిస్ట్రేషన్(Registration) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు UGC అధికారిక వెబ్‌సైట్‌ను ugcnet.nta.nic.in సందర్శించడం ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల, యుజిసి నెట్ పరీక్షకు సంబంధించి నోటీసు జారీ చేయడం ద్వారా పరీక్ష తేదీల గురించి సమాచారం ఇచ్చింది. తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. నోటిఫికేషన్ విడుదలైన రోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. డిసెంబర్ 31, 2022 నుంచి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ముఖ్యమైన తేదీలు..
UGC NET డిసెంబర్ పరీక్ష 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది . దీనికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 17, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ తాజాగా ఈ అప్లికేషన్ల స్వీకరణ తేదీని మరో మూడు రోజులు పెంచారు. జనవరి 21-23 వరకు దరఖాస్తుల చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అంటే నేడు రాత్రి వీటి దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తు చేయని అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ విడుదల చేసిన పబ్లిక్ నోటీస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
పరీక్షా కేంద్రం యొక్క నగరం ఫిబ్రవరి 2023 మొదటి వారంలో విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ నుండి ఫిబ్రవరి 2023 రెండవ వారం నుండి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC NET డిసెంబర్ పరీక్ష 2022 ని ఫిబ్రవరి 21 నుండి మార్చి 10, 2023 వరకు నిర్వహిస్తుంది . పరీక్ష వ్యవధి మూడు గంటలు మరియు పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. మొదటి షిప్టు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. UGC NET పరీక్ష 83 సబ్జెక్టులకు CBT విధానంలో నిర్వహించబడుతుంది.
దరఖాస్తు ఫీజు..
అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ. 1100 చెల్లించాలి. అయితే EWS, OBC-NCL అభ్యర్థులు ఫీజు రూ. 550 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు రూ.275 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకోండిలా..
- దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే ugcnet.nta.nic.inని సందర్శించండి.
-ఇక్కడ హోమ్‌పేజీలో అప్లికేషన్ లింక్ డిస్ ప్లే అవుతుంది. దానిపై క్లిక్ ఇవ్వండి.
-ఈ పేజీలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
-దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
-చివరగా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, UGC, UGC NET