UGC NET 2022 పరీక్షలో హాజరైన అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ UGC NET 2022 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధాన కీని విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.inని సందర్శించడం ద్వారా అభ్యర్థులు సమాధానాలను సరి చూసుకోవచ్చు. కీని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆన్సర్ కీ విడుదలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెస్పాన్స్ షీట్‌ను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు ఎన్టీఏ(National Testing Agency) విడుదల చేసిన సమాధానాల కీలను(Answer Key) సవాలు చేయాలనుకుంటే.. వారు తమ అభ్యంతరాలను అక్టోబర్ 20 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవచ్చు. గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసిన అభ్యంతరాలు చెల్లవని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అభ్యంతరం తెలిపేందుకు.. అభ్యర్థి ఒక్కో ప్రశ్నకు రెండు వందల రూపాయల ఫీజును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు సవాల్ చేస్తే.. అన్ని ఒక్కో ప్రశ్నలకు రూ.200 చెల్లించాలి. అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 20 వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంటుంది.
అభ్యర్థి సవాలు సరైనదని తేలితే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జవాబు కీని మారుస్తుంది. ఆ తర్వాత మరోసారి ఆన్సర్ కీ విడుదల చేస్తారు. అయితే అభ్యర్థి సవాల్ చేసిన కీ ని పరిగణలోకి తీసుకోవడం లేదా తీసుకోకపోవడం అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి వ్యక్తం చేసిన అభ్యంతరాల ప్రశ్నల గురించి అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వరని పేర్కొంది. వీటిని అన్నింటిని పరిగణలోకి తీసుకొని NTA త్వరలో పరీక్ష యొక్క తుది సమాధాన కీని విడుదల చేస్తుంది. దీనిపై అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయడానికి వీలు ఉండదు. ఆ జవాబు కీ ఫైనల్ గా పరిగణించబడుతుంది.
ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Step 1: ఆన్సర్ కీని చూసుకోవడానికి UGC NET యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దాని కోసం ఇక్కడ ugcnet.nta.nic.in క్లిక్ చేయండి.
Step 2: ఇప్పుడు హోమ్‌పేజీలో UGC NET 2022 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3: దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4: ఇప్పుడు మీ వివరాలు పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబర్ ఇవ్వండి.
Step 5: తర్వాత అభ్యర్థి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి ఆన్సర్ కీని ఒకసారి చెక్ చేసుకోవాలి.
Step 6: అభ్యర్థులు UGC NET 2022 యొక్క జవాబు కీని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exam key, Exams, JOBS, UGC NET